
నువ్వు ఎప్పుడో శిథిలమైన గతానికి ప్రతీకవని నేననుకున్నాను.
ఏదీ ధైర్యంగా నాలోకి ఓ మాటు తొంగి చూసి చెప్పమని నా మనసు నిలదీసింది.
నాలో నువ్వు లేవని దాన్ని నమ్మించడానికి విఫలయత్నం చేశాను.
మనసు పోరుకి ఎదురు నిలవలేక ఏవో నిశివీధుల్లో తప్పించుకు తిరిగాను.
నేను నిమిత్త మాత్రురాలిని అన్నట్టు కాలం తన రంగులు మారుస్తూ కరిగిపోతూనే ఉంది.
గుండెలో ఏ మూలనో రహస్యంగా దాగిన మధుర జ్ఞాపకాలు ఉన్నట్టుండి నిద్ర లేచాయి.
ఇన్నాళ్ళూ మా జాడ మరచినట్టు భ్రమపడుతున్నావు కదూ అని నన్ను ప్రశ్నిస్తున్నాయి.
కరిగిపోయింది కేవలం కలేనని చెప్పి మనసుని మాయ చెయ్యాలని ప్రయత్నిస్తున్నాను.
కల కాదు నే కోల్పోయింది మరెన్నటికీ తిరిగిరాని అమూల్యమైన ప్రేమనీ అది వాదిస్తోంది.
వేదనతో ఘనీభవించిన నా మనసుని వెచ్చటి కన్నీళ్ళలో కరిగించెయ్యాలని ఉంది.
నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయిన నా అమాయకత్వానికి నవ్వొస్తోంది.
నిన్ను చేజార్చుకున్న నా పిచ్చితనానికి జాలేస్తోంది.
నిన్నందుకోలేకపోయిన నా దురదృష్టానికి కోపమొస్తోంది.
నిన్ను చేరుకోలేని నా అశక్తతకి ఏడుపొస్తోంది.
నిరంతరం వెంటాడుతున్న నీ తలపుల నుంచి దూరంగా పారిపోడానికి ప్రయత్నిస్తూ అలసిపోతున్నాను.
నా మనసు పొరల్లో నిక్షిప్తమై ఉన్న నీ స్మృతుల్ని తుడిచెయ్యలేక ఓడిపోయి సోలిపోతున్నాను.
ఇప్పుడు కూడా నువ్వు పంచిన అప్పటి జ్ఞాపకాలే నా తోడుగా నిలబడి నా మనసుకి ఊపిరి పోస్తున్నాయి!
:(
ReplyDelete@ జాబిలి,
ReplyDeleteకవిత బాగోలేదాండీ? :(
కల కాదు నే కోల్పోయింది మరెన్నటికీ తిరిగిరాని అమూల్యమైన ప్రేమనీ అది వాదిస్తోంది.
ReplyDeleteఈ లైన్ చాలా బావుంది
inception కాన్సెప్ట్ కూడా ఇదే :)
Its touching...
ReplyDelete"నేను నిమిత్త మాత్రురాలిని అన్నట్టు కాలం తన రంగులు మారుస్తూ కరిగిపోతూనే ఉంది."
ReplyDelete"కరిగిపోయింది కేవలం కలేనని చెప్పి మనసుని మాయ చెయ్యాలని ప్రయత్నిస్తున్నాను."
ఆ రెండు చోట్లా ఆగి కాసేపు ఎటో వెళ్ళాను..
కవిత చాలా బాగుంది..
Hmm
ReplyDeleteKavitha chala chala bagundi Madhura.. Miru rasevanni baaga nachutayi, kavithalayina, maatalayina.
ReplyDeleteAyyo anipinchichesindi chadivithe, meaning chala touching ga undi.
(I sincerely hope it didnt come out of your own experience. idi publish cheyyakandi (miku ibbandi avutundemo ani))
కవిత బాగుంది మధుర గారు.....
ReplyDelete>>నీ ప్రేమని అర్థం చేసుకోలేకపోయిన నా అమాయకత్వానికి నవ్వొస్తోంది.
నిన్ను చేజార్చుకున్న నా పిచ్చితనానికి జాలేస్తోంది.
నిన్నందుకోలేకపోయిన నా దురదృష్టానికి కోపమొస్తోంది.
నిన్ను చేరుకోలేని నా అశక్తతకి ఏడుపొస్తోంది.
నాకు ఈ లైన్స్ బాగా నచ్చాయి....
chaalaa baagaa raasaarandee poguttukunnakkaanee viluva theliyadu,but by then its too late.jeevitham anthe kadoo
ReplyDeleteచాలా బాగుంది. నాకైతే ఈ లైన్ బాగా నచ్చింది
ReplyDelete"వేదనతో ఘనీభవించిన నా మనసుని వెచ్చటి కన్నీళ్ళలో కరిగించెయ్యాలని ఉంది...."
చాలా బాగుంది కాని మీరు ప్రేమలో మునిగి ఉంటారనుకుంటే చేజారిన ప్రేమ గురించి రాసారేంటా అని....-:)
ReplyDeleteTouching.
ReplyDeleteమధుర గారు, కవిత చాలా బాగుంది..మనసు కొద్దిసేపు ఎటో వెళ్లిపోయింది, తన అట్టడుగు పొరల్లో ఙ్ఞాపకాల్ని వెతుక్కుంటూ...:(
ReplyDeleteకవిత బాగుంది మధుర గారు.....ఈ లైన్ ఆ లైన్ అని కాదు కాని ప్రతీ లైన్ బాగుంది ..heart touching
ReplyDeleteIndu gaari commente naadi kudaa....
ReplyDeleteఏదో పప్పు గురించో నెయ్యి గురించో, సరదాగా రాసుకోక .. ఏంటి ఈ ఏడుపు కవితలు? చోద్యం కాపోతే!!
ReplyDeleteభాషని పదాల్ని ఉపయోగించిన తీరు కొత్తగా బాగుంది. భావం - వోకే.
ReplyDeleteకవిత చాలా చాలా బాగుంది....
ReplyDeleteకొత్తగా పెళ్ళికూతురు......సరదాగా జీవితాన్ని గడిపేయకుండా ఈ "చేజారిన ప్రేమ!" ఏంటండి????
ReplyDelete@ హరేకృష్ణ,
ReplyDeleteInteresting interpretation. అదేనండీ inception సినిమాకి పోల్చి చూడటం.
@ పద్మార్పిత,
Thank you! :)
@ ఏకాంతపు దిలీప్,
ధన్యవాదాలు. మిమ్మల్ని కాసేపైనా ఎటో తీస్కెళ్ళగలిగిందంటే నా కవితకి పాస్ మార్కులు వచ్చినట్టే! ;)
@ గీతాచార్య,
అయితే, మీ అభిప్రాయం ఏవిటంటారు ప్రొఫెసర్ గారూ? :)
నిరంతరం వెంటాడుతున్న నీ తలపుల నుంచి దూరంగా పారిపోడానికి ప్రయత్నిస్తూ అలసిపోతున్నాను.
ReplyDeleteనా మనసు పొరల్లో నిక్షిప్తమై ఉన్న నీ స్మృతుల్ని తుడిచెయ్యలేక ఓడిపోయి సోలిపోతున్నాను.
ఇప్పుడు కూడా నువ్వు పంచిన అప్పటి జ్ఞాపకాలే నా తోడుగా నిలబడి నా మనసుకి ఊపిరి పోస్తున్నాయి
SIMPLY SUPERB.
@ జాబిలి,
ReplyDeleteమొత్తానికి కవిత మీకు నచ్చినందుకు నేను హ్యాపీ! మీ అభిమానానికి చాలా సంతోషంగా ఉంది. :)
అసలు మీదెంత సున్నితమైన మనసండీ.. నన్ను మంచనిపించేలా ఉన్నారే! ;) ఊరికినే ఇలా ఒక కవిత ట్రై చేయాలనిపించి రాసాను. అంతే తప్ప ఇందులో నా బాధేమీ లేదు. నా గురించి మీరంతా ఆదుర్దా పడుతుంటే నేను మీకు సమాధానం చెప్పకపోతే ఎలా! అందుకనే మీ కామెంట్ పబ్లిష్ చేసాను.
మీ ప్రేమాభిమానాలకి కృతజ్ఞురాలిని. :)
@ ఇందు, ౩గ్, శిశిర, శివరంజని, సవ్వడి, అనానిమస్2, కిరణ్..
వ్యాఖ్యానించిన బ్లాగ్మిత్రులందరికీ ధన్యవాదాలు. కవిత మీకందరికీ నచ్చినదుకు సంతోషంగా ఉంది. :)
@ అనానిమస్1,
ధన్యవాదాలండీ! మీరు చెప్పింది అక్షర సత్యం.. జీవిత సత్యం కూడా! :)
@ మనసు పలికే,
హుమ్మ్.. మళ్ళీ తిరిగొచ్చేసారా మరి? మనసుకి మతిమరుపుంటే బాగుంటుంది అనిపిస్తుంది కొన్నిసార్లు! :)
@ చెప్పాలంటే,
ReplyDeleteధన్యవాదాలు. ఇలాంటి కవిత రాయగలనో లేదో చూద్దామని కాస్త వెరైటీగా ప్రయత్నించానండీ. అంతే! :)
@ అమ్మాయి,
మీది మరీ చోద్యమండీ.. రోజూ పప్పు గురించి నెయ్యి గురించీ రాస్తూ పోతే నాతో పాటు చదివే జనాలకి కూడా విసుగు వచ్చేయదూ!? ;)
@ కొత్తపాళీ,
అయితే నా ప్రయత్నం సఫలమేనన్నమాట! ధన్యవాదాలు. :)
@ అనానిమస్3,
మీ అభిమానానికి ధన్యవాదాలు. నేను జీవితాన్ని సరదాగానే గడిపేస్తున్నానండీ! కేవలం ఒక భావాన్ని అక్షరాల్లో పెట్టగలనా లేదా అన్న ప్రయత్నంలోనే ఈ కవిత రాసుకున్నాను. మీరేం బెంగ పడకండి. :)
Hi. Madhuravani garu,
ReplyDeleteEee kavita chaala bavundi..I like this tyoe of peotry.
AKVishwa
www.okahrudayam.blogspot.com
@ Ankur,
ReplyDeleteThank you! :)
Mee kavitha chala bagundi. Naa fav lines
ReplyDeleteకల కాదు నే కోల్పోయింది మరెన్నటికీ తిరిగిరాని అమూల్యమైన ప్రేమనీ అది వాదిస్తోంది.
వేదనతో ఘనీభవించిన నా మనసుని వెచ్చటి కన్నీళ్ళలో కరిగించెయ్యాలని ఉంది.
నిరంతరం వెంటాడుతున్న నీ తలపుల నుంచి దూరంగా పారిపోడానికి ప్రయత్నిస్తూ అలసిపోతున్నాను.
@ మీ శ్రేయోభిలాషి,
ReplyDeleteధన్యవాదాలండీ! :)
చాల చాల బావుంది మీ "చేజారిన ప్రేమ"
ReplyDelete@ b,
ReplyDeleteధన్యవాదాలండీ! :)