
ప్రేమంటే ఏంటి?
ప్రేమ గుడ్డిది. Love is blind!
కొత్తగా ప్రేమలో పడ్డవాళ్ళకి ఎవరైనా ప్రేమ గుడ్డిది అనేవాళ్ళని చూస్తే 'పాపం.. గుడ్డి వాళ్ళు!' అని జాలిగా అనిపిస్తుంది.
వాళ్ళ చుట్టూ ఉన్నవాళ్లకేమో ఆ ప్రేమలో పడ్డ వాళ్ళే గుడ్డివాళ్లలా కనిపిస్తుంటారు.
అసలైతే నిజంగా ప్రేమ గుడ్డిదే! కాకపోతే అసలేమీ కనిపించని గుడ్డితనం కాకుండా colour blindness లాంటిదన్నమాట!
ఆ సదరు ప్రేమలో పడిన వ్యక్తికి మాత్రమే కొంతమేరకు ప్రపంచమంతా కొత్త కొత్త రంగుల్లో కనిపిస్తుంటుంది.
కాకపోతే, యీ రకమైన గుడ్డితనం జీవితాంతం ఉంటే, అంతా హ్యపీసే! కొన్నాళ్ళకి గుడ్డితనం పోయి ప్రేమించిన వ్యక్తిలో మామూలు రంగులు కనిపించాయనుకోండి. అప్పుడే వస్తుంది అసలు తంటా!
యీ గుడ్డితనం కాస్తా ఒకళ్ళకి వచ్చి ఇంకొకళ్ళకి రాలేదనుకోండి.. మళ్ళీ అదొక సమస్య. ఆ సదరు వ్యక్తికి కళ్ళు పోయేలా చేయడానికి.. అదేనండీ గుడ్డితనం తీసుకురాడానికి.. అదేనండీ ప్రేమలో పడెయ్యడానికి నానా తంటాలు పడాల్సి వస్తుంది పాపం! మళ్ళీ అదొక పెద్ద ప్రహసనం అవ్వచ్చు, హింసాత్మకం కూడా అవ్వచ్చు. చెప్పలేం మరి!
అన్నట్టు, రెడీమేడ్ గుడ్డితనం అని ఇంకో కాన్సెప్ట్ కూడా ఉంది. అదేంటంటే, నాకు ఫలానా విషయం ఫలానా రంగుల్లో కనపడుతోంది అని గుడ్డిగా ఊహించేసుకుని గుడ్డితనం తెచ్చేసుకోడం అన్నమాట. ఉదాహరణకి అమ్మాయితో పాటు లక్షల ఆస్తి కట్నం వస్తుంది అంటే అమ్మాయి అతిలోకసుందరిలా కనిపించడం, లేదా అబ్బాయి కోటీశ్వరుడు అని తెలిస్తే నవమన్మథుడిలా కనిపించడం..
వగైరా లాంటివన్నమాట!
ఇదంతా బానే ఉంది గానీ, మరి పెళ్ళంటే ఏంటి? అన్న సందేహం వచ్చేస్తోంది కదూ మీకు! వస్తున్నా.. వస్తున్నా.. అక్కడికే వచ్చేస్తున్నా!
ఏమీ లేదండీ. వెరీ సింపుల్.. యీ యొక్క సదరు గుడ్డితనాన్ని జీవితాంతం, చిరకాలం ఉండేలా కాపాడుకోడానికి ఇద్దరు గుడ్డివాళ్ళు చేసే గుడ్డి ప్రయత్నమన్నమాట!
ముందే చెబుతున్నాను. యీ గుడ్డి పోస్టు చూసి inspire అయ్యి ఎవరైనా గుడ్డివాళ్ళయిపోదాం అనుకుంటే నా పూచీ లేదోచ్!
అసలీ గుడ్డి గోల ఏంటీ అనుకుంటున్నారా? యీ రోజు పొద్దున్నే ఏకాంతపు దిలీప్ గారి 'బజ్' లో "ప్రేమంటే ఏంటి?" అని చూసి Love is blind! అని కామెంట్ పెట్టాను. అలా అలా ఆలోచిస్తుంటే, సరదాగా ఇలా అనిపించింది! అదన్నమాట యీ గుడ్డి పోస్టు వెనక ఉన్న గుడ్డి కారణం!
సో ఇప్పుడు మనం గుడ్డివాళ్ళం పైగా ఆ గుడ్డి తనాన్ని కాపాడుకునే యత్నం చేసే వాళ్ళం అంటారు :P
ReplyDeleteMine is first comment :-) welcome back!
ReplyDeleteWelcome back
ReplyDeleteమీ పెళ్ళి కబుర్లు చెప్పకుండా ఈ ప్రేమ గుడ్డిది..పెళ్ళంటే ఇద్దరు గుడ్డివాళ్ళు చేసే గుడ్డి ప్రయత్నం అంటూ ఈ కబుర్లు ఏంటండి బాబు!
పెళ్ళిపుస్తకం తెరిచొచ్చిన వెంటనే ఈ టపా అంటే కారణమేమిటి చెప్మా..
ReplyDelete@ శ్రీనివాస్,
ReplyDeleteమరి ఈ థియరీ ప్రకారం ఆలోచిస్తే అంతే అనుకోవాలి కదండీ! :p
@ హరేకృష్ణ,
Thanks for the welcome ! :-)
@ సిరిసిరిమువ్వ,
Thanks for the welcome ! :-) అంతేనంటారా? పెళ్లి కబుర్లు బోర్ కొట్టేస్తాయేమోనని చెప్పట్లేదండి.
@ రిషి,
పెళ్లి పుస్తకానికీ దీనికీ ఏ సంబంధమూ లేదండి. ఏదో సరదాకి ఈ గుడ్డి పోస్ట్ రాసానని ముందే చెప్పాను కదండీ! :-)
:)
ReplyDeleteWelcome back
మధురవాణి గారు, ఎన్ని రోజులు అయింది మీ టపా చూసి.:)
ReplyDeleteనిజమే.. మీ పెళ్లి కబుర్లు కదా ఈరు ఇప్పుడు చెప్పాల్సింది.. భద్రాచలం లో అంట కదా పెళ్లి జరిగింది..?? మా ఊరే..:) కొత్త పెళ్లికూతురు గారికి మనస్పూర్తిగా అభినందనలు తెలియజేసుకుంటున్నాను..:)
:) :(
ReplyDeleteఅయితే ఇంతకీ మీ పెళ్ళికి కూడా ఈ గుడ్డే(గుడ్డి ప్రేమ)కారణమా? నవ వధువుకి అభినందనలు,విశేషాలు త్వరలో అందిస్తారని ఆశిస్తూ.
ReplyDeleteఅభినందనలు మధురవాణి గారు.
ReplyDeleteగుడ్డి కబుర్లు ఎందుకు కాని గుడివాడ కబుర్లు చెప్పమ్మాయ్ .
ReplyDeleteపెళ్ళంటే...... "యీ యొక్క సదరు గుడ్డితనాన్ని జీవితాంతం, చిరకాలం ఉండేలా కాపాడుకోడానికి ఇద్దరు గుడ్డివాళ్ళు చేసే గుడ్డి ప్రయత్నమన్నమాట!మీ గుడ్డి స్లోగన్ గుడ్డి ..గుడ్డిగా...బాగుందండి.సో ...."మీరుకూడా మా గుడ్డివాళ్ళ జాబితాలోకి వచ్చేసారంటకదా స్వాగతం ..సుస్వాగతం ..
ReplyDeleteమీరు ఈ మధ్య కనపడట లేదేమిటి చెప్మా? అనుకున్నాను...ఇదా సంగతి.నూతన వదువుకి శుభాకంక్షలు.
హేయ్ వచ్చేసావా?
ReplyDeleteఏమిటీ, కొత్త జీవితంలో అడుగుపెట్టిన కొన్ని రోజులకే తత్వం తన్నుకొస్తోంది, అలాగే ఉంటుందిలే....కొన్నాళ్ళకి అలవాటయిపోతుంది ఆ గుడ్డితనం :)
నేను welcome చెప్పబోతున్నందుకు ఎలాగు thanks చెప్తారు కాబట్టి, ఆ విషయం పక్కనపెట్టి అసలు సంగతి మాట్టాడుకుందాం ’ విమ్దు భోజనం ఎప్పుడు.....I want to know right now '.
ReplyDeleteఅడిగానని చెప్పి ఈ గుడ్దివాడి ముందు సినిమా చూపెట్టరుగా....
ముందుగా మీకు శుభాకంక్షలు మళ్లి వచ్చినందుకు సుస్వాగతములు.
ReplyDeleteHi..........
ReplyDeleteWel come Smiley Queen!
This post was average.
Hoping we get posts regularly!
congratulations and all the best for your new chapter in life :)
ReplyDeleteముందు పెళ్ళి కబుర్లు చెప్పవోయ్!
ReplyDeletebagundi andi mee guddi post :)
ReplyDeleteHmm
ReplyDeleteThatz y I have spectacles :D
Yes. Love is Blined... B lined Bee lined
Welcome back..
ReplyDeleteకొత్తపాళీ గారు 'స్మైలీల రాణి మధురవాణి' అని ఎందుకన్నారో ఇప్పుడు మరికొంచం బాగా అర్ధమయ్యిందండీ :-)
ఏంటమ్మాయ్! మాంఛి ఉషారుషారుగా గుడ్డితనం గురీంచి రాసేసావ్! మాలా కుమార్ గారన్నట్లు గుడ్డితనం కబుర్లేమిటి గుడివాడ కబుర్లు చెప్పాలి కాని!
ReplyDeleteCongratulations and wish you a very happy married life!!
ReplyDeleteNaku telugu lo ela type cheyyali telidam ledu.. ippatiki ee wishes andukondi Madhura.
నవవధువుకి అభినందనలు...
ReplyDeleteongratulations and all the best for your new married life
ప్రేమ గుడ్డిదే!నిజమే.కాని ఇద్దరు ప్రేమికులు ముఖ్యంగా ప్రేమానుబంధంతో ముడిపడ్డ భార్యాభర్తలు ఆ ప్రేమను తడబడనీక నడిపించే జంట నయనాలు.ఏమంటారు?మధురవాణి దంపతులకు శుభాశీస్సులు.
ReplyDelete:) Welcome Back.
ReplyDeleteమధుర వాణి గారు,
ReplyDeleteప్రమదావనం లో కనిపించడం లేదేమిటి? అలిగారా?
అబ్బ మళ్ళీ చాన్నాళ్ళకి రాసారు..టపా...
ReplyDeleteఈవిడ ఏమైపోయిన్దబ్బా అనుకుంటున్నాను ఈ మధ్య.....ఇలా గుడ్డి వాళ్లై పోయారని తెలీదు సుమండీ...
any way....congratulations....
ఇంకో మాట....స్మైలీలు పెట్టడం లో మీకు మీరే సాటి.....
ప్రేమ గుడ్డిది అనేవాళ్ళందరూ గంటపాటు నీల్డౌన్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం...అలాగే ఇలాంటి టపాతో ప్రేమికుల మనసుని గాయపరిచినందువల్ల వైఎస్ జగన్ వచ్చి ఓదార్చాలని బ్లాగుముఖంగా కోరుతున్నాం....అనండి అనండి...మీకు పెళ్ళవదా..అప్పుడు భావావేశ కవితలు బ్లాగులో రాయరా..అప్పుడు దొరక్కపోరు మీరు..:)
ReplyDeleteమీకొచ్చిన కొంగ్రొత్త గుడ్డితనానికి నా ప్రగాఢ సానుభూతి ;)
ReplyDeletebtw can you enlighten me on how to activate java script to run smileys ?
Dear Madhuravani,
ReplyDeletehappy married life.Btw r u from Bhadrachalam? is ur father a bank employee?i'm curious bcz my husband had attended his collegue daughter's marriage on the same day&same venue.No need to publish this comment .Just reply yes if my guess is correct else no need.
welcome Back మధురవాణి గారు. మీకు మీ శ్రీవారికీ కూడా శుభాకాంక్షలు.
ReplyDelete"యీ యొక్క సదరు గుడ్డితనాన్ని జీవితాంతం, చిరకాలం ఉండేలా కాపాడుకోడానికి ఇద్దరు గుడ్డివాళ్ళు చేసే గుడ్డి ప్రయత్నమన్నమాట!"
ReplyDelete:) :)!!
Welcome back మధుర. పెళ్ళి కబుర్లు చెపుతారని చూస్తుంటే...!!! ఈ గుడ్డోళ్ళిద్దరు ఈ గుడ్డి తనం ఇలానే జీవితాంతం వుంచుకుంటారని ఆశిస్తూ...
ReplyDeleteWishing you Good luck.
@ 3g , మనసు పలికే, చైతన్య.ఎస్, అశోక్ పాపాయి, సవ్వడి, రాణి, జాబిలి, రాజి, శిశిర, వేణూ శ్రీకాంత్, భావన..
ReplyDeleteశుభాకాంక్షలతో స్వాగతం పలికిన నేస్తాలందరికీ హృదయ పూర్వక కృతజ్ఞతలు. :)
@ శివప్రసాద్,
ReplyDelete:) :) ఇంతకీ :( ఈ స్మైలీ అర్థం ఎమిటంటారూ?
@ శ్రీనివాస్ పప్పు,
మీ అభినందనలు అందుకున్నాను. ధన్యవాదాలు. మరేనండీ.. అంతే అంతే..అలాంటి గుడ్డితనమే! ;)
@ మాలా కుమార్,
చూస్తున్నాను మాలా గారూ.. మీ అల్లరంతా గమనిస్తూనే ఉన్నాను. :)
@ రాధిక (నాని),
ధన్యవాదాలు. అవునండీ.. కొత్తగా గుడ్డివాళ్ళ జాబితాలో చేరిపోయాను. :)
@ ఆ.సౌమ్య,
హహ్హహ్హా.. కదా! ఉన్నట్టుండి.. ఇలా తత్త్వం వచ్చేసింది. :D
@ నాగార్జున,
'వివాహ భోజనంబు' పాట కలర్లో చూపెట్టనా పోనీ! ;)
@ సుజాత, అమ్మ ఒడి,
ReplyDeleteఅందరికీ తెలిసిన కబుర్లే ఉంటాయి కదండీ! బోర్ కొట్టేస్తుందేమోనని చెప్పట్లేదు. :)
@ దివ్యవాణి,
ధన్యవాదాలు! :)
@ గీతాచార్య,
:D :D :D
@ మురళి,
ధన్యవాదాలు. :) :) కొత్తపాళీ గారు అలా అన్నారా? ఎప్పుడు.. ఎక్కడ? నేను చూడలేదే! :(
@ జాబిలి,
మీరు తెలుగులో సులువుగా టైపు చేయాలనుకుంటే, ఈ లింక్ చూడండి.
http://www.google.com/transliterate/indic/Telugu
@ C.ఉమాదేవి,
ReplyDeleteమీరంత అందంగా చెప్పాక.. మరేమనగలను? మీ శుభాశీస్సులు అందుకున్నాం. హృదయపూర్వక ధన్యవాదాలు :)
@ స్థితప్రజ్ఞుడు,
ధన్యవాదాలు. :)
@ శేఖర్ పెద్దగోపు,
హలో.. శేఖర్ జీ, నాకు పెళ్లవడం వల్లే కదండీ.. పైన అందరూ గొడవ చేస్తున్నారు ఈ గుడ్డి పోస్టు గురించి. :)
ఇప్పుడు కాకపోయినా, ఇంకో నాల్రోజులయ్యాకయినా మీరే ఈ గుడ్డి పోస్టుతో ఏకీభవించక తప్పదు. అన్నట్టు, మీ కోరిక మేరకు జగన్ ఓదార్పు యాత్రకి సన్నాహాలు మొదలయ్యాయిట కదా! ;) :D
@ తృష్ణ,
:) :)
@ భావన,
మీ ఆశీస్సులు బాగున్నాయి. Thank you! :)
@ నీహారిక గారూ,
ReplyDeleteఅలాంటిదేమీ లేదండీ! :)
@ krishna,
:) :)
"how to activate java script to run smileys ?" --I don't know anything about java script and its activation. :(
When you are writing a post, you can also copy and paste the smileys from else where. It works for me. :)
జ్యోతి గారూ,
ReplyDeleteThank you for your wishes! :) మా నాన్న గారు బ్యాంక్ ఎంప్లాయి కాదండి. ఇంకా వివరంగా మాట్లాడాలనుకుంటే నా బ్లాగర్ ప్రొఫైల్లో నా మెయిల్ ఐడి ఉంది. మెయిల్ చేయండి.
హెల్లో హెల్లో హెల్లో మధుగారూ !.. నమస్తే. మీ వైవాహిక జీవితం ఆనందమయం, ఆహ్లాదమయం, సుఖప్రదం అవ్వాలని కోరుకుంటున్నాను ..
ReplyDeleteమీరు కొంత కాలం టపా పెట్టకపోయేసరికి మీ బ్లాగ్ ఓపెన్ చెయ్యడం మానేసాను .. పైగా ఈమధ్య Ph.D వర్క్ లో బిజీ అయిపోయాను (అప్పుడప్పుడైనా కొంచెం వర్క్ చెయ్యకపోతే డిగ్రీ ఇవ్వరేమో అని చేస్తున్నా లెండి.).. మొత్తానికి మళ్ళీ మమ్మల్ని మెప్పించే టపాలతో వచేసారన్నమాట. సంతోషం.. టపాలన్నీ బాగున్నాయి.. కౌముది లో కథ ఇంకా చదవలేదు.. కానీ ఎన్ని టపాలు పెట్టినా మీ పెళ్లి టపా లేకపోతే మేమంతా చాలా నిరుత్సాహపడతాం. మీరు పెళ్లి భోజనాలు పెడతారునుకుంటే ఉత్తి నెయ్యి అన్నం తో సరిపెట్టేసారు.. నాకు కుడా నెయ్యి చాలా ఇష్టం లెండి.. కాని, చెప్పానుగా, మాకు పెళ్లి భోజనాలు కావాలి..
సరే, మీ కథ చదివాక మళ్ళీ కామెంట్ పెడతాను.. మీరు ఈలోపు దయచేసి మీ అభిమానుల వినతి గురించి ఆలోచించండి..
-------- హరీష్
@ హరీష్,
ReplyDeleteఎన్నాళ్ళకి మళ్ళీ కనిపించారు! PhD చేస్తున్నారు కాబట్టి.. మీరెంత బిజీయో నేనూహించగలను. ;)
మీ శుభాకాంక్షలు అందుకున్నానండీ! ధన్యవాదాలు. :)
పెళ్లి కబుర్లంటే, ఎప్పుడో అప్పుడు తప్పక రాయడానికి ప్రయత్నిస్తానండి. :)
అయినా, మీకీ విషయం తెలీదా! వేడి వేడి అన్నంలో నెయ్యేసుకుని తింటే వచ్చే రుచి పెళ్లి భోజనం ముందు బలాదూరే! కాబట్టి, ప్రస్తుతానికి అలా కానిచ్చెయ్యండి మరి! ;)