Sunday, August 01, 2010

నా కథ 'కిన్నెరసాని ఒడ్డున...' 'కౌముది' పత్రిక ఆగస్ట్ సంచికలో!

నేను రాసిన మూడో కథ 'కిన్నెరసాని ఒడ్డున...', సాహితీలోకంలో నెలనెలా వెన్నెల కురిపిస్తున్న 'కౌముది' ఇంటర్నెట్ మాసపత్రిక 'ఆగస్ట్' సంచికలో ప్రచురితమైంది.
నా కథని అంగీకరించి ప్రచురించి కౌముది సంపాదక వర్గానికి మరోసారి నా బ్లాగ్ముఖంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. చదివి చూసి మీ అభిప్రాయాలని తెలియజేస్తారని ఆశిస్తూ..
-- మధుర

37 comments:

  1. బోలెడు అభినందనలు :)

    ReplyDelete
  2. ముచ్చటగా మూడో కథ ప్రముఖ వెబ్ పత్రికలో వచ్చినందుకు అభినందనలు.

    ReplyDelete
  3. కధ బాగుందండీ........ ఏదో మంచి ట్రావెలాగ్ చదువుతున్నట్టనిపించింది. మీఊరు కూడా అలాగే ఉండేదా.....

    ReplyDelete
  4. కధా బాగుంది,మీరూ బాగున్నారు డాక్టర్ మధుర వాణి గారు :)(రచయిత పరిచయం లో మీరు పీ హెచ్ డీ చేసారు అని ఉంది మరి).. మీ ఫోటో చూసానోచ్ ఇన్ని రోజులకి

    ReplyDelete
  5. మధురవాణి గారు:

    చాలా బాగుంది. నా జ్ఞాపకాల పొరల కింద ఎక్కడో వున్న కిన్నెరసాని వూరిని తట్టి లేపారు. ఆ చిన్న వూరు, ఆ మెలికల వాగు, ఆ అద్దాల మేడ, ఆ వెన్నెల బయలు(యానం బైల్) అలానే వున్నాయని అనిపిస్తోంది మీ కథ చదువుతూంటే!

    www.afsartelugu.blogspot.com

    ReplyDelete
  6. మధురవాణి గారు ,కౌముదిలో ఇది మీ రెండవ కథ అనుకుంటాను.అభినందనలు

    ReplyDelete
  7. శుభాకాంక్షలు!
    శుభాకాంక్షలు!
    ఒకటి రచయిత్రిగా పేరు తెచ్చుకుంటున్నందుకు,
    రెండోది మీ వివాహ సందర్భంగా!
    కిన్నెరసాని వాగు గురించి బాగా రాశారు.

    ReplyDelete
  8. మధురవాణి గారు,
    మీ కథ చదివాను. బాగుంది. ముఖ్యంగా.. మీరు చెప్పిన గులాబి తీగ - సన్నజాజి తీగ ఎగ్జాంపుల్.
    కంగ్రాట్స్!
    కృష్ణప్రియ/

    ReplyDelete
  9. అభినందనలు మధురవాణి గారు.

    ReplyDelete
  10. మధుర వాణి గారు,
    కథ చాలా బాగుంది. మీ పెళ్లి సందర్భంగా అభినందనలు :)

    ReplyDelete
  11. కధ బావుందండి. ఊరెళ్తున్నా, అక్కడ పరిస్థితులను ఎదుర్కోవడానికి ప్రిపేర్ చేసేశారు :-)

    And congratulations on your wedding.

    ReplyDelete
  12. మీ కథ ఇంకా చదవలేకపోయాను కానీ మీ ఫోటో చదివాను. మీ కన్నా మీ పేరే బావుంది :)

    ReplyDelete
  13. బాగుందండి మీ కథ, బాగా రాసారు

    ReplyDelete
  14. wowwwwwwww!!!!! మా మధుర గారు పెళ్లి కూతురు కాబోతున్నారా??? really i feel very happy...
    కధ soooooooper.......

    ReplyDelete
  15. chala bagundandi :)
    keep writing

    ReplyDelete
  16. కథ చాలా బాగుంది మధురవాణి గారు. చదువుతుంటే నాకు మా పెనుమూడి క్రిష్ణా నది పాయ గుర్తు వచ్చింది. చిన్నప్పుడు బందరు వెళ్లాలంటే అది దాటి వెళ్లేవాళ్లం. పాత ఙ్ఞాపకాల్ని గుర్తు చేసినందుకు ధన్యవాదాలు. మీ వివాహ సందర్భంగా శుభాకాంక్షలు (ఎప్పుడో డేట్ తెలియదండి :-)).

    ReplyDelete
  17. నేను చదివేసానోచ్! చాలా బాగుంది... పాపి కొండలు దాటి అటువైపు ఎప్పుడూ రాకపోయినా కిన్నెరసాని ఊహల్లో ఎప్పుడూ ఉంటుంది.. ఇంకా పుట్టిన ఊరితో ఉండే అనుబంధాన్ని బాగా పలికించారు కథలో... మా ఊరు, మా పొలం గుర్తొస్తుంది...

    ReplyDelete
  18. @ హరే కృష్ణ, సుజ్జీ, తెలుగు తూలిక, మాలా కుమార్, దివ్యవాణి, సాయి ప్రవీణ్, సుభగ, సావిరహే,
    నా కథని ఓపిగ్గా చదివి అభిప్రాయం తెలిపిన మిత్రులందరికీ ధన్యవాదాలు. :-)

    @ 3g,
    ధన్యవాదాలండీ! నిజంగా మీకలా అనిపిస్తే నా ప్రయత్నం సఫలం అయినట్టే! :-) అవునండీ.. అలాంటి అందమైన ఊరొకటి నా జ్ఞాపకాల్లో ఉంది. :-)

    @ మానస,
    ధన్యవాదాలండీ! అవునండీ నేను డాక్టర్ నే! ;-)

    @ అఫ్సర్ గారూ,
    మీ వ్యాఖ్య చూసి చాలా సంతోషమేసిందండీ! ధన్యవాదాలు! అయితే మీకు యానంబైలు తెలుసన్నమాట! అలా అలా సాగిపోయే ఆ కిన్నెరసాని ఒడ్డున ఉన్న ఒక చిన్న గ్రామం గురించే నేను కథలో చెప్పింది. :-)

    @ బెల్లంకొండ లోకేష్ శ్రీకాంత్,
    అవునండీ.. ధన్యవాదాలు. :-)

    ReplyDelete
  19. @ మందాకిని,
    మీకు డబుల్ థాంక్యూ అండీ! :-)

    @ కృష్ణ ప్రియ,
    కథ మీకు నచ్చినందుకు సంతోషంగా ఉంది. ధన్యవాదాలండీ! :-)

    @ బద్రి,
    హహ్హహ్హా.. అంతేనంటారా! ధన్యవాదాలండీ! :-)

    @ శరత్ కాలమ్,
    నా పేరు బాగుందన్నందుకు ధన్యవాదాలు. ;-)

    ReplyDelete
  20. @ శివరంజని,
    :-) :-) :-) మీ అభిమానానికీ, శుభాకాంక్షలకీ.. బోలెడు ధన్యవాదాలు. :-)

    @ సుధ,
    నా కథ మీ జ్ఞాపకాల్ని కదిపిందంటే అంత కంటే ఇంకేం కావాలండీ! ధన్యవాదాలు. :-)

    @ ఏకాంతపు దిలీప్,
    మీ జ్ఞాపకాలూ కదిపిందన్నమాట నా కథ! సంతోషం. :-) ధన్యవాదాలు!

    ReplyDelete
  21. జ్ఞాపకాల ఒడ్డున కిన్నెరసాని హొయలు చూపి అంతలోనేకిన్నెరసాని దైన్యాన్ని కళ్లకు కట్టినట్లు చెప్పారు.జ్ఞాపకాల జ్ఞాపికకు ముసుగు వేయలేం. మనసుపై జ్ఞాపకాలు చెరిగిపోని పచ్చబొట్లే!
    వివాహసంధర్భంగా శుభాకాంక్షలు.

    ReplyDelete
  22. హలో మధు గారు.. కధ చదివాను,, చాలా బాగుంది.. తేనె లో ముంచి వెంటనే బూడిద లో పడేసారు... అన్నింటికన్నా ఎక్కువగా కార్తీక్ తండ్రి చెప్పే వివరణ చాలా బాగుంది.. భావ ప్రకటనలో మీరు బాగా ఆరితేరిపోయారు..

    అభినందనలు ..

    .....హరీష్

    ReplyDelete
  23. @ C.ఉమాదేవి,
    జ్ఞాపకాల గురించి చాలా బాగా చెప్పారండీ! హృదయపూర్వక ధన్యవాదాలు! :)

    @ HARISH,
    అంతేనంటారా? ఏదో ఇపుడిప్పుడే నేర్చుకుంటున్నాను. సంతోషంగా ఉందండీ మీకూ కథ నచ్చినందుకు. ధన్యవాదాలు. :)

    ReplyDelete
  24. సున్నితమైన సందేశాన్ని అంతే సున్నితమైన కథనంతో చెప్పారు. ఈ కిన్నెరసాని వాగులాగానే హాయిగా సాగింది. అభినందనలు.
    మిగతా రెండు కథలూ ఎక్కడ?
    ఆపకుండ రాస్తూ ఉండండి.

    ReplyDelete
  25. అయ్యబాబోయ్ గురువమ్మగారూ ! ఇది చాలా అన్యాయమండి.. మీ పెళ్లి ఎప్పుడా, దాని గురించి మీరు ఎలాంటి టపా పెడతారా అని ఎంతోమంది ఫాన్స్ ఎదురుచూస్తుంటే , (మీ పాత టపాలకి వ్యాఖ్యలు పెట్టినపుడు అడిగారు గా చాలామంది ) ఇలా చెప్పా పెట్టకుండా డుం డుం పిప్పీ మోగించేద్దామని కుట్ర పన్నుతారా ?

    ReplyDelete
  26. చక్కని కథ రాసినందుకు అభినందనలండీ..

    ReplyDelete
  27. చక్కని కథ రాసినందుకు అభినందనలండీ..

    ReplyDelete
  28. Mee katha chaala baagundi. Idi nijamo kalpitamo naaku teliyadu kaani naa jeevitam lo ilaane jarigindi. Kaani aa devuni krupa valla maakunna chinni polam maa daggare undandi. Meerannattu palletoollu ippudu anni peddala kosame annattu unnaay. Okka abbay kuda kanipinchatledu. Andaru pattanam lone untunnaaru. Mee katha naa kathanu gurtu chesela chesindi. Chala thanks andi.

    ReplyDelete
  29. అభినందనలు.... చపట్లు...

    No wonder... you write soo sweet...

    Each post is a treat !! Kudos!

    ReplyDelete
  30. Katha bagundi. Kinnerasani gurinchina vivrana bagundi...but chala lenthy ga unnatlu anipinchindi.
    concept bagundi. chadivana prati okkariki chinnanati gnapakalu gurthu raavadam khayam.

    ReplyDelete
  31. ఇందిర గారూ మీ వివాహ బాంధవ్యం ఇరువురి మనసుల ఒకటిగా చేసి మనోరంజకంగా సాగాలని మనఃస్ఫూర్తిగా ఆ దేవదేవుని వేడుకుంటున్నాను.

    ReplyDelete
  32. టైటిల్ లాగే కధ హృద్యంగా ఉంది కాస్త ఆలస్యంగా చదివాను అభినందనలు మధురవాణి గారూ !

    ReplyDelete
  33. మధుర గారు!,
    మీ టపాలన్ని గత రెండు రోజులు గా చదివి పూర్తిచేసాను. మీ ఈ పనిమంతురాలు టపా చదివి అసలు ఒక రేంజి లో నవ్వాను అనుకోండి. ఇంకా మీ మామ కబుర్లు...అదేనండి చందమామ కబుర్లు, మీ బంగారం కబుర్లు మీ పూతోట కబుర్లు చాలా బాగా వ్రాసారండి. నేస్తం గారిలా మీ కబుర్లు బాగున్నాయి, అసలు మీ బ్లాగు హరే క్రృష్ణ గారి బ్లాగు ద్వార తెలిసింది.

    రఘురాం.

    ReplyDelete
  34. @ కొత్తపాళీ,
    గురూ గారూ మీరు బాగుంది అన్నారంటే, సంతోషంగా ఉంది. పాతవి కూడా మీరు చూసారు ఇదివరకు. రాయడం మాత్రం తప్పక ప్రయత్నిస్తూ ఉంటాను. :)

    @ హరీష్,
    పెళ్లి గురించి ప్రత్యేకంగా ఏం టపా వెయ్యాలో నాకు అస్సలు అయిడియా రాలేదండి. సుజనమధురం బ్లాగులో సుజ్జీ చెప్పింది కదా అని నేను మళ్ళీ చెప్పలేదు నా బ్లాగులో. :)

    @ మురళి,
    ధన్యవాదాలండీ! :)

    @ Kamalaker N,
    నా కథ మీ జ్ఞాపకాలని కూడా తట్టి లేపిందంటే చాలా సంతోషంగా ఉంది. ధన్యవాదాలు! :)

    ReplyDelete
  35. @ Coolvivek,
    ఓపిగ్గా ప్రతీ పోస్టు చదివి ప్రోత్సహిస్తున్న మీకు ధన్యవాదాలు!

    @ Anonymous,
    మీ అభిప్రాయం తెలిపినందుకు ధన్యవాదాలు.

    @ భాస్కరరామిరెడ్డి,
    మీ శుభాకాంక్షలు అందుకున్నానండీ. ధన్యవాదాలు! :)

    @ పరిమళం,
    ధన్యవాదాలు!

    @ Raghuram,
    చాలా సంతోషంగా ఉందండీ! మీరు నిజంగా చాలా గ్రేట్ సుమా! నా బ్లాగంతా రెండ్రోజుల్లో చదవాదమే కాకుండా, పోస్టుల పేర్లు గుర్తు పెట్టుకుని మరీ కామెంట్ పెట్టారు. మీరంత ఓపిగ్గా చదివినందుకు బోలెడన్ని ధన్యవాదాలు. నేస్తం గారితో పోలిస్తే అవార్డ్ వచ్చినట్టేనండీ! :)

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!