Saturday, July 24, 2010

వెన్నెల్లో..



వెన్నెల ఎడతెరిపి లేకుండా వర్షంలా కురుస్తోంది. ఎటువైపు చూసినా, కనుచూపుమేరా దట్టంగా కురుస్తున్న వెన్నల వానే!
వెన్నెల వానలో తడిసిపోతూ మల్లె పందిరి పక్కనే నీ కోసం ఎదురు చూస్తూ నేను!

అచ్చంగా విచ్చుకున్న మల్లెలతో నిండిపోయి తెల్లగా మెరిసిపోతున్న మల్లె పందిరి మీద మనసుపడింది కాబోలు వెన్నెల.. తన మెరుపునంతా మల్లె పందిరి మీదే ఒలకబోసేస్తోంది.


ఇంతటి మెరుపు నే మోయలేనన్నట్టు మల్లె పందిరి కాస్తా తన మల్లెల గుభాళింపుతో కలగలిపి మొత్తంగా నా మీదకే వంపేస్తోంది.


నీ రాక కోసం ఎదురుచూస్తూ యీ వెన్నెల్లో స్నానం ఎంత బాగుందో!

పైన ఆకాశంలో మబ్బులన్నీటినీ దాటుకుంటూ ఝూమ్మని పరుగులు తీస్తున్నాడు చందమామ.. విరహగీతికని మురిపించడానికో మరి!


పరుగులు తీసే చందమామలాగే నువ్వు కూడా నా కోసం పరుగున వస్తూ ఉంటావు కదూ అని ఆలోచనలో పడ్డానా!


ఇంతలోనే సన్నటి పిల్ల గాలి తెమ్మెర ఒకటి పరుగున వచ్చి కొబ్బరాకు చెవిలో అల్లరిగా గుసగుసలాడింది. వెంటనే కొబ్బరాకు సిగ్గుతో మెలికలు తిరిగిపోతూ గలగలా నవ్వింది.

ఆహా.. ఎంత అందమైన దృశ్యం!

ఇహ ఎంతసేపటికీ నువ్వు రావట్లేదని నే వెళ్లి విరజాజి తీగతో కాసిని ఊసులు చెప్పి వచ్చాను. అటూ ఇటూ తిరుగుతూ నలువైపులా వెతికి చూసాను.. నీ జాడేమైనా తెలుస్తుందేమోనని!


నేను పడుతోన్న ఆరాటం చూసి గగనంలో ముచ్చటగా కొలువుదీరిన మెరుపుల చుక్కలన్నీ ఫక్కున నవ్వాయి. ఇంతందంగా సింగారించుకుని చక్కనోడి కోసం ఎదురు చూస్తున్నావంటూ అడిగాయి.


నేను బదులు చెప్పకుండా ముసిముసిగా నవ్వేస్తున్నానా.. ఇంతలో దొంగలా నా వెనక నుంచి నువ్వొచ్చి చప్పున నా రెండు కళ్ళూ మూసేశావు.. ఎవరో చెప్పుకోమంటూ!


నీ ముద్దు మోము ఓసారి కళ్ళారా చూద్దామని.. నీ చేతులు విడిపించుకుని గారంగా నవ్వుతూ వెనక్కి తిరిగి చూసేసరికి... నిద్ర పోయి తెలివొచ్చింది! sengihnampakgigi



37 comments:

  1. ఇంతకూ కల ఏ సమయంలో వచ్చిందన్నదే మా ప్రశ్న.

    ReplyDelete
  2. కంగారొద్దు... మెలకువవచ్చాక కూడా కనపడతారు లే టైం వచ్చినప్పుడూ. ;-) పౌర్ణమి ఒక రోజు ముందే వచ్చిందే...:-)

    ReplyDelete
  3. ఇది కలలో కాదు ఇలలో లోనే నెరవేరబోతోంది...సరేనా...అందమైన శుభాభినందనలతో.....

    ReplyDelete
  4. naku niddarosthondi andi meedi chadina tarwatha.....avalithalu kuda vasthunnayi...!!!

    ReplyDelete
  5. So sweet friend......
    Jaya gaari commente naadi kudaa

    ReplyDelete
  6. ఈ విషయం చెప్పేవాళ్లకు చెప్పావా లేదా?? అసలువ్యక్తికి తెలిస్తే కలని వాస్తవం చేస్తారన్నమాట.. :)

    ReplyDelete
  7. miru eppudina news paper lo pani chesara, chaala baga rastunnaru. good keep it up.

    ReplyDelete
  8. మధురవాణి గారు,అబ్బా ఎంత చక్కగా రాసారో..ఆ మల్లెల పరిమళాల గుభాళింపు నాక్కూడా తగులుతుంది మీ పోస్ట్ చదువుతుంటే..వెరీ పొయటిక్ అండ్ రొమాంటిక్..అవును అప్పుడే మెలకువ ఎందుకొచ్చింది మీకు?? ;-)

    ReplyDelete
  9. చక్కని భావుకత్వం. చాలా బాగుంది మీ కల. మాకు కూడా వెన్నెల స్నానాలు చేసిన అనుభూతి కలిగించింది.

    ReplyDelete
  10. అబ్బబ్బబ్బ ఈ మధుర వాణి గారు ఉన్నారే!!! ఈమె పేరు లో ఉన్న మధు(sweet) అంతా ఈమె పోస్ట్ లోనే కనిపిస్తుంది .... నేను చాలా ఉడుక్కుంటున్నా ..

    ReplyDelete
  11. "ఈ విషయం చెప్పేవాళ్లకు చెప్పావా లేదా?? "నాదీ అదే ప్రశ్న :) :)

    ReplyDelete
  12. @ చిలమకూరు విజయమోహన్,
    నిశిరాత్రి పూట, నక్షత్రాలు మిణుకు మిణుకుమని మెరిసే వేళలో, అప్పుడప్పుడే కళ్ళు మూతలు పడుతూండగా, ల్యాప్ టాపు ముందేసుకుని ఈ టపా రాస్తున్నప్పుడు వచ్చింది ఈ ఊహ! ;-)

    @ భావన,
    అంతే అంటారా? అయితే, ఆ టైం కోసం ఎదురు చూస్తాను. ;-) ఊహల్లో పౌర్ణమి ఎప్పుడు కావాలంటే అప్పుడే వచ్చేస్తుంది కదా! ;-)

    @ జయ,
    మీ అందమైన శుభాభినందనలు ఆనందంగా అందుకున్నాను. మీకు బోలెడన్ని ధన్యవాదాలు జయ గారూ! :-)

    @ హరే కృష్ణ,
    ఆ నవ్వులకి అర్ధం ఏవిటట? :-) :-)

    ReplyDelete
  13. @ సావిరహే,
    అంటే.. కొంపదీసి నా పోస్టు చదవడం వల్ల బోరు కొట్టి నిద్ర వచ్చిందా ఏవిటండీ? ;-) ధన్యవాదాలు. :-)

    @ సవ్వడి,
    ధన్యవాదాలు ఫ్రెండ్.. :-)

    @ జ్యోతి,
    అంతేనంటారా? అలా అయితే మీ సలహా ఫాలో అయిపోతాన్లెండి! ;-) ధన్యవాదాలు. :-)

    @ స్వప్న@కలలప్రపంచం,
    ధన్యవాదాలు. :-) నేను నా బ్లాగుల్లో తప్ప ఏ న్యూస్ పేపర్లలోనూ ఎప్పుడూ రాయలేదండీ!

    @ RamakrishnaReddy kotla,
    ధన్యవాదాలండీ! మల్లెల పరిమళం చదివిన మీదాకా వచ్చిందంటే, నా పోస్ట్ కి సార్ధకత్వం వచ్చినట్టే! ఈసారి అట్టే మెలకువ తెచ్చుకోకుండా ఎక్కువసేపు కలలోనే ఉండే ప్రయత్నం చేస్తాన్లెండి. ;-)

    ReplyDelete
  14. @ ఏకాంతపు దిలీప్,
    భలే మాట పట్టేశారే! :-)

    @ సుభగ,
    ధన్యవాదాలండీ! చదివిన మీక్కూడా ఆ అనుభూతిని కలిగించగలిగానంటే, నేను చాలా హ్యాపీ! :-)

    @ శివరంజని,
    అయ్యయ్యో.. మీరు ఉడుక్కుంటూ అక్కడే ఆగిపోయారా? నేనింకా నాతో పాటు నడుస్తూ వెన్నెల్లో తడిసారనుకున్నానే! ;-) Thanks a lot for your affectionate compliment! :-)

    @ పరిమళం,
    అలాగలాగేనండీ.. తక్షణం ఆ పన్లో ఉంటాను నే వెళ్లి. ;-)

    ReplyDelete
  15. అబ్బా..ఎంత అందమైన కల...అయినా మీకు మరీ ఆశ కాకపోతే అలా కనులు మూసిన వారిని తొందరగా చూసేయాలన్న ఆత్రం దేనికండి...అదే లేకపోతే మరికాసేపు కల కంటిన్యూ అయ్యేదిగా! మరిన్ని భావుకతతో కూడిన వాక్యాలు మేము చదివేవాళ్ళం..ప్చ్..

    సింప్లీ సూపర్బ్...

    ReplyDelete
  16. ప్రతి కన్నె పిల్లకు వచ్చే కామన్ కలే అనుకో..కాని కల ఏదేమైనా మొహం కనబడదు ఎందుకో.. మళ్ళా పెళ్ళి చూపుల్లో ఠాట్ ఇతనెవరో అతను కాదు అని భీష్మించుకుని కూర్చుంటామనేమో..పెళ్ళికి ముందు నుండే మొదలు పెట్టెస్తారు ఈ దాగుడుమూతలు .మాయల మరాఠీలు కదా :)

    ReplyDelete
  17. @ మధురవాణి గారు
    నా వరకూ అయితే, మీరు పోయిటిక్ గా పలికింది, మీలో పలికించింది.. ఆ రెండు మాటలే :)
    మిగిలిన పదాలు అంటే వెన్నెల, మల్లె, సన్నజాజి, తెమ్మెర, చందమామ ఇవన్నీ వాటికవే గొప్ప కవిత వస్తువులు. ఆ పదాలు సరిగ్గా వాడితే ఒక ఆకర్షణ వాటికవే సంతరించుకుంటాయి. చివర్లో మీరు పలికిన ఆ రెండు భావాలే ( గారం, నవ్వు ) ఎక్కడికో తీసుకెళ్ళాయి...

    ReplyDelete
  18. నేస్తం గారు!
    మధురవాణి గారి కలల కుమారుడు..... తన చెలి కనులను అల్లరిగా మూసి అలక తీరుద్దామనుకుంటే............. మీరేమో " మరాఠి " , " గిరాఠి " అంటారా... నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.

    ReplyDelete
  19. Beautiful.! Naademo matti burra kada.. late ga ekkindi :P

    ReplyDelete
  20. చాలా బాగుంది మీ కవిత.
    చక్కని భావుకత్వం. చాలా బాగుంది మీ కల.

    ఇది కలలో కాదు ఇలలో లోనే నెరవేరబోతోంది...సరేనా...అందమైన శుభాభినందనలతో

    ReplyDelete
  21. కొయ్ కొయ్ ఇది కలంటే నేనసలు నమ్మనమ్మాయ్ . నేస్తం గారు , మాయల మరాఠీ కాదు , మధురవాణి నే మనలను మాయ చేస్తోంది . ఏదో కథ వుంది :-))

    బాగుంది . మమ్మలినీ వెన్నెల్లో తడిపేసావు .

    ReplyDelete
  22. @ శేఖర్ పెద్దగోపు,
    అరెరే..అవును కదండీ.. ఈసారి అలా తొందరపడకుండా వెయిట్ చేస్తాను. సరేనా! ;-) ధన్యవాదాలు :-)

    @ నేస్తం,
    హహ్హహా.. మీ లాజిక్ భలే బావుందే! :-D అవునండీ.. నిజం చెప్పారు. మాయల మరాఠీలే!

    @ ఏకాంతపు దిలీప్,
    మీరు చెప్పింది నిజమేనండీ! ఆ పదాల్లోనే ఉంది అందమంతా! అయితే, మీకా expression నచ్చిందన్నమాట! థాంక్యూ! :-)

    ReplyDelete
  23. @ సుజ్జీ,
    ఎప్పుడో ఒకప్పుడు నీకు Beautiful అనిపించిందిగా! అదే నాకు మహాభాగ్యం! :-)

    @ ANU,
    ధన్యవాదాలండీ! మీ శుభాభినందనలకి కూడా కృతజ్ఞతలు. :-)

    @ మాలా కుమార్,
    నేనేం మాయ చేశానండీ.. పాపం అసలే చిన్నపిల్లని. అయినా, మీరే చెప్పండి. ఇప్పటికిప్పుడు జర్మనీ లో మల్లెపందిరి, విరజాజి తీగ, కొబ్బరి చెట్టు ఎక్కడి నుంచి వస్తాయి చెప్పండి.. కలలో తప్ప ;-)

    ReplyDelete
  24. Many congratulations!!
    కిన్నెరసాని ఒడ్డున చాలా బావుంది :)

    ReplyDelete
  25. వర్ణణ చాలా బావుంది...

    చివరి లైను చదవగానే నువ్వు నాకు నచ్చావులో సీన్ గుర్తొచ్చింది...ఐతే తొందర్లో ఎవరో మహానుభావుడు ’ఉఫు ఉఫు’ అని ఊదుకుంటాడేమో, బాబు కలల రాకుమారా ఎక్కడున్నావు నాయనా ;)

    ReplyDelete
  26. @ హరేకృష్ణ, రాధిక (నాని),
    ధన్యవాదాలు. :-)

    @ నాగార్జున,
    ధన్యవాదాలు. :) :) :)

    ReplyDelete
  27. beautiful! gaaliki kobbaraaku oogatamlo anta andam, ardham, nenu eppudu oohinchaledu, you have so beautifully romanticised the little movements and interactions in nature!

    ReplyDelete
  28. Awesome....!!

    What a sweet drench.. What a Deluge.. Flood of moonlight.. Wow..

    I am inundated and overwhelmed..

    Loved it, Madhuravani... Claps..

    ReplyDelete
  29. chala bagundi mee varnana. chala andam ga raasaru. image kuda baaga suit ayindi. congrats & all d best for ur future posts.

    ReplyDelete
  30. chala bagundi mee varnana. chala andam ga raasaru. image kuda baaga suit ayindi. congrats & all d best for ur future posts.

    ReplyDelete
  31. kala gurinchi mee varnana adbhutamandi....

    mee post chadivaka naku gulebhakavali katha ane patha mv lo oka andamaina pata gurtuku vachindi

    "KALALA ALALA PAI TELENOO MANASU MALLEPOOVAYI,
    EGASI PODUNOO CHELIYA NUVVE IKA NENAAYI"

    ReplyDelete
  32. @ Krisent,
    Thank you dear! :)

    @ coolvivek, Suma,
    Thank you! :)

    @ భరత్,
    ధన్యవాదాలు! భలే మంచి పాట గుర్తొచ్చిందే మీకు! :)

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!