Sunday, June 20, 2010

నాన్నా...

-->

నేనెవరో తెలియని యీ ప్రపంచానికి నీ ముద్దుల యువరాణిగా నన్ను పరిచయం చేశావు.
నా బుల్లి పాదాలు కందిపోతాయేమోనన్న బెంగతో నీ అరచేతుల్లో అడుగులేయిస్తూ నడక నేర్పించావు.
నీ ఒడిలో మాటలు నేర్చుకున్నాను. నీ మాటల్లో ప్రపంచాన్ని చూశాను.

అలుపెరగని నీ శ్రమైక జీవనంలో కృషి, పట్టుదల, నిజాయితీ అంటే ఏవిటో పోల్చుకున్నాను.
నీ ఆచరణలో మానవత్వపు పరిమళాన్ని వెదజల్లడం ఎలానో తెలుసుకున్నాను.
నీ చల్లటి నీడలో స్వేచ్ఛగా నాదైన సొంత వ్యక్తిత్వాన్ని పొందగలిగాను.
నీ జీవితమంతా ధారపోస్తూ నీ చేతుల్లో అందంగా మలచబడిన శిల్పాన్ని నేను.

నా వెనక కొండంత అండలా నువ్వున్నావన్న ధైర్యమే జీవితంలో నే వేసే ప్రతీ అడుగు వెనకా ఉంది.
నా మీద నీకున్న అంతులేని ప్రేమే నన్ను విజయం వైపు పయనించేలా చేస్తోంది.
నిన్ను తలచుకోగానే వచ్చే వెయ్యేనుగుల బలమే బ్రతుకు బాటలో ఎదురయే సవాళ్ళను ఎదుర్కొని పోరాడే శక్తినిస్తుంది.
నువ్వు లేని నాకు అస్తిత్వమే లేదు. అయినా నాన్నా... నేనెవర్ని... నీ ప్రతిరూపాన్నే కదూ!


24 comments:

  1. మధురవాణి గారు మొదట మీకు అభినందనలు అండి నిన్నటి మి ఈనాడు బ్లాగోగు శీర్షికకి మరియు మీ నాన్న గారికి ఫాదర్స్ డే శుభాకాంక్షలు మీకు మొదట కామెంట్ రాసినందుకు చాలా ఆనందంగా ఉందండి .

    ReplyDelete
  2. adbhutham.. idi kevalam kavitha ani pogidekannaa, andhuloni mee bhaavam, vedhana chalaa baadha kaligisthondhi.. anthaku minchi meerichukunna swayamprerana mee aatma sthairyaanni theliyajepthondi.. hats of to u..

    ReplyDelete
  3. మీ భావం బాగుంది. ఈరోజు కాకుండా ఇంకేరోజైనా తెలుపుంటే బాగుండేది. I hate father's day, mother's day, etc.. ఇవి మనకి అవసరం లేదు.

    ReplyDelete
  4. నాన్న గురించి చక్కగా మీ ప్రేమ ని వ్యక్తం చేశారు మధురవాణి.

    ReplyDelete
  5. నమస్కారం.
    మెదటగా టపాకు ఏమాత్రం సంబంధం లేని వ్యాఖ్య వ్రాసినందుకు క్షమించండి.
    సమూహము గురించి చెప్పుకుందామని మీ బ్లాగు తలుపు తడుతున్నాను.
    తెలుగు బ్లాగులు విస్తృతంగా వాడుకలో ఉన్న ఈ ఎలక్ట్రానిక్ యుగములో అన్ని తెలుగు బ్లాగులను ఒక గూటిలోనికి తేవాలనే మా ప్రయత్నం .మీకు నచ్చిన ,మీరు మెచ్చిన బ్లాగులను ఈ బ్లాగులో చేర్చవచ్చును.
    సమూహము ను మీరు చూడాలంటే ఈ లింకు పైన నొక్కండి. సమూహము మీ బ్లాగునుంచి టపాలను మరియు ఫోటోలను సేకరించి చూపిస్తుంది. అంతే కాక మీరు,మనతోటి బ్లాగర్లు వ్రాసిన టపాలను గానీ వ్యాఖ్యలను చూసుకోవడం చాలా సులభం.

    మీ సౌకర్యాన్ని బట్టి వీలును బట్టి ఓ సారి దర్శించండి. నచ్చితే వాడండి. ఇంకా నచ్చితే మీబ్లాగులో సమూహము లింకు ను వుంచి ప్రోత్సహించండి.
    సమూహము లింకు ఇక్కడ నుండి సంగ్రహించి మీ బ్లాగులో వుంచవచ్చు.
    అభిప్రాయాలను దయచేసి ఇక్కడ తెలుపండి .
    దయచేసి మీ సలహను / సూచలను ఇక్కడ తెలపండి మీ వ్యాఖ్యలు మాకు అమూల్యమైనవి .
    --
    ధన్యవాదముతో
    మీ సమూహము

    ReplyDelete
  6. Dear Madhu,

    Congrats! I never comments on your bolg, but I am a regular follower to your posts.Very interesting and analyzing posts. I am surprised to see that you just finished your PhD, I was feeling that you are kind of in in 35-40 years.Because your posts are very mature.I am in PhD program now (Chemistry), but I think I am elder than you.

    By the way my son likes your MIRAPAKAYA POTTODU story. You remind me my child hood in many posts ,specially in this story.

    Sorry if I hurt you any thing while expressing my feelings.
    I wish for your good success.

    ReplyDelete
  7. Madhuravani Eenadu ki na kritagnatalu mee blog gurinchi rasinanduku.Mee expression,style chala sumadhuram ga unnayi.Mee regular readers lo nenu kuda okarini avutanu.

    ReplyDelete
  8. చాలా బాగుంది కవిత .

    ReplyDelete
  9. నాన్న కవిత బాగుంది .

    ReplyDelete
  10. మంచి కవితను అందిచారు నచ్చింది.

    ReplyDelete
  11. నేను నిన్ననే చూసానండీ..నాన్న గురించి టపా ఒకటి మీ బ్లాగులో కనపడాలి కదా అని...మీరు ఎంతైనా నాన్న కూతురు కదూ! అందుకే అలా వేచి చూశాను...చాలా చక్కగా వ్యక్తపరిచారు మీ నాన్న గారి గురించి మీ గుండెల్లో ఉన్న భావాలను...

    ReplyDelete
  12. కవిత బాగుంది .నేను నాన్న కూతురినే అందుకే మా అమ్మ అస్తమాను ఉడుక్కుంటుంది.
    సవ్వడి గారు చెప్పింది నిజమే...అమ్మ నాన్నల మీద ప్రేమ ఏదో ఒక్కరోజు తలుచుకునేది కాదు . జీవితం అంతా మన గుండెల్లో పెట్టుకోని కొలుచుకునేది.అబ్బో చాల పెద్ద మాటలు చెప్పేసాను అనుకుంటా..

    ReplyDelete
  13. Nanna gurinchi chala chakkaga rasharu, neenu eenadu lo mee blog gurinchi parichyam chesaka mee blog follow avvuthunnanu, mee blog chala bagundhi.

    ReplyDelete
  14. బాగుంది మధుర, చక్క గా వ్యక్తం చేసేరు నాన్న మీది ప్రేమ. కొంచెం లేట్ గా Happy Fathers Day. :-)

    ReplyDelete
  15. Madhuravani garu,
    me dhairyam me maatallo kuda undi. twaralone doctorate puchchukuni naku kuda teliyajeyandi. subhaakankshalu.

    ..."sumitra"

    ReplyDelete
  16. Mee Kavitha

    Chala bagundi..

    Dhanyavadalu..

    ReplyDelete
  17. happy fathers day anDi, naaku antha adrushTam ledu lemDi.there is no relation between me nd my father

    ReplyDelete
  18. మన వ్యక్తిత్వమే నాన్న అస్తిత్వం .....బావుంది మధురవాణి గారూ !

    ReplyDelete
  19. @ దివ్యవాణి,
    మీ అభినందనలన్నీటినీ అందుకున్నానండీ! హృదయపూర్వక ధన్యవాదాలు! ఫస్ట్ కామెంట్ రాసినందుకు కూడా థాంక్స్! :-)

    @ హరీష్,
    నేను రాసిందేమో గానీ, మీ కామెంట్ మాత్రం చాలా బాగుందండీ! ధన్యవాదాలు. :-)

    @ సవ్వడి,
    Thanks for the comment. తల్లిదండ్రులని రోజూ పట్టించుకోకుండా ఏదో మథర్స్ డే నో, ఫాతర్స్ డే నో అని పెట్టి ఆ ఒక్క రోజే ప్రేమించడం నా దృష్టిలో కూడా అంగీకారయోగ్యం కాదండి. తల్లిదండ్రులు ఎప్పుడైనా మనకి విలువైనవారే.. అయినా కానీ ప్రపంచమంతా కలిసి వాళ్ళ పేరు మీద ప్రత్యేకంగా ఒకరోజు celebrate చేస్కోడం కూడా తప్పు కాదని నా ఉద్దేశ్యం. ఇది నా సొంత అభిప్రాయం మాత్రమే సుమా!

    @ కల్పనా రెంటాల,
    ధన్యవాదాలండీ!

    @ సమూహం,
    thanks for the information.

    @ సుజ్జి, కౌండిన్య, రాధిక (నాని), మాలాకుమార్, అశోక్ పాపాయి, ramnarsimha, పరిమళం,
    స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు. :-)

    ReplyDelete
  20. @ కవిత,
    మీ కామెంట్ చాలా సంతోషాన్ని కలిగించిందండీ! హార్ట్ అయ్యేలా మీరేమీ రాయలేదు. :-) మనిషెవరో తెలీకుండా, కేవలం రాతలు చదివినప్పుడు మన ఊహల్లో ఒక్కోలా అనిపించడం సహజమే కదండీ! అయితే మిరపకాయ్ పొట్టోడు మీ బాబుకి కూడా నచ్చాడన్నమాట! ఆ కథలో మహత్యమే అది కదండీ! :-)

    @ శ్రీలక్ష్మి,
    చాలా సంతోషమండీ.. ధన్యవాదాలు. :-)

    @ శేఖర్ పెద్దగోపు,
    ధన్యవాదాలు. సంతోషంగా అనిపించింది మీ కామెంట్ చూసి.. అవును మరి.. ఎంతైనా నాన్న కూతుర్నేగా! ;-)

    @ శివరంజని,
    ధన్యవాదాలండీ! అయితే, మీరూ నా జట్టేనన్నమాట.. అదే నాన్న కూతుర్ని అన్నారుగా! పెద్ద మాటలు కాదు.. మంచి మాటలు చెప్పారు. :-) ఈ ఫాదర్స్ డే, మదర్స్ డే గురించి నా అభిప్రాయాన్ని పైన సవ్వడి గారికి చెప్పాను. చూడండి. :-)

    @ విద్యార్థి,
    సంతోషమండీ.. ధన్యవాదాలు. :-)

    @ భావన,
    మీరు చెప్పారంటే, తిరుగే లేదు.. నిజంగా బాగున్నట్టే! శుభాకాంక్షలు అందుకొన్నాను. ధన్యవాదాలు :-)

    @ సుమిత్ర,
    ధన్యవాదాలు. నేను గతేడాదే డాక్టరేటు అందుకున్నానండీ! :-)

    @ హను,
    అయితేనేమండీ.. భవిష్యత్తులో మీరొక నాన్నయినప్పుడు ఈ ఆనందం అనుభవిస్తారుగా! I sincerely wish it for you! :-)

    ReplyDelete
  21. nice one! naanna gurinchi enta raasina full ga express cheyyalem. But its a nice thought to attempt.

    ReplyDelete
  22. కవిత బావుంది మధుర ఇప్పుడే చదివాను.

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!