Thursday, February 04, 2010

అచ్చం మన ప్రేమలాగే!



ఆకాశం నుంచి జాలువారి నను తాకీ తాకగానే మాయమవుతున్న సన్నటి వాన తుంపర్లు
నీ మోముపై క్షణంలో మెరిసి మాయమయ్యే దొంగ నవ్వుని గుర్తుకి తెస్తున్నాయి.

నేల మీద మెలమెల్లగా అదృశ్యమవుతున్న మంచు మేట
నీపైనున్న నిన్నటి నా అలకని కూడా కరిగిస్తున్నట్టుంది.

ఇంతలోనే చప్పున మబ్బుల చాటునుంచొచ్చి నను ముద్దాడిన సూర్యకిరణాలు
నీ నులివెచ్చని స్పర్శని జ్ఞప్తికి తెచ్చాయి.

అంతలోనే యీ సూర్యకాంతి, స్వాతి చినుకులు రెండూ మమేకమై
అంబరాన అందమైన హరివిల్లుని చిత్రించాయి.. అచ్చం మన ప్రేమలాగే..!!


21 comments:

  1. చాలాబాగుంది మధురవాణి గారు మీ కవిత.ఆ ఫోటో ఉన్న ప్లేస్ లో నేను ఉంటే ఎంత బాగుంటుందో.....

    ReplyDelete
  2. మధురమైన వూహ.. :-)

    ReplyDelete
  3. చాలా బాగుంది

    ReplyDelete
  4. అందమైన పోలికలు.. ముగించిన విధానం చాలా బావుంది :-)

    ReplyDelete
  5. మధురవాణిగారు మీకవిత చాలాబాగుంది!

    ReplyDelete
  6. నేను బ్లాగు మొదలు పెట్టాక మొదటి కామెంట్ మీకే చేశాను, మీరు నా బ్లాగు కి విచ్చేసి కామెంట్ చేసినందుకు చాలా థాంక్స్ .

    ReplyDelete
  7. మధురవాణి గారు! మీ కవిత.. మీ ప్రేమ.. రెండూ మధురంగానే ఉన్నాయి.

    ReplyDelete
  8. @ హను, శేఖర్, సుజ్జీ, మందాకిని, రవిచంద్ర, భావన, శిశిర, అనానిమస్, పద్మార్పిత, వేణూ శ్రీకాంత్, విజయమోహన్ గారూ, సవ్వడి, ప్రణీత, పరిమళం..
    స్పందించిన మిత్రులందరికీ పేరుపేరునా ధన్యవాదాలు :)
    @ స్రవంతి,
    నేను కూడా మంచులో హరివిల్లు ఇప్పటిదాకా చూళ్ళేదండీ.! గూగుల్ లో దొరికింది ఫోటో.
    @ నిషిగంధ గారూ,
    హయ్య బాబోయ్..నేను కవిత రాయడమే పెద్ద అద్భుతం అయితే, దాన్ని మీరు బావుందని మెచ్చుకోవడం..చాలా చాలా పెద్ద విషయం. మీకు బోలెడన్ని ధన్యవాదాలు. మీ వ్యాఖ్య చూసి నేను ఎగిరి గంతేసినంత పని చేసానంటే మీరు నమ్మాలి మరి ;-)

    ReplyDelete
  9. @ మురళి, కొత్తపాళీ, అక్షరమోహనం..
    ధన్యవాదాలండీ :)

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!