Monday, January 04, 2010

ఏమో.!


నా సాహచర్యం నీ జీవనచిత్రంలో క్రొంగొత్త రంగులు నింపిందన్నావు.

నీ కళ్ళలోకి చూస్తే నాపైనున్న అపరిమితమైన ప్రేమ తొణికిసలాడింది.
నాలో నేనే నా సంతోషం చిరునామాని వెతుకుతుంటే నీ రూపు కనిపించింది.
ఇంతకీ నీలో నేనున్నట్టా.. నాలోనే నువ్వున్నట్టా..!?
నేనే నువ్వా.. నువ్వే నేనా.. ఇద్దరం ఒకటేనా.!?
ఏమో.! ఆకాశానికి చందమామ అందమా.. చందమామకి ఆకాశం ఆధారమా అంటే ఏమని చెప్పగలం.?
ఆకాశం, చందమామ ఒకచోట చేరితేనే కదా అసలైన ఆనందం..!



15 comments:

  1. ఒకరికొకరు తోడు. బాగుంది.:)

    ReplyDelete
  2. మీ ఊహల ఊసులలో ఎన్ని ప్రశ్నలో? బాగుంది.

    ReplyDelete
  3. నిజమే సుమీ.. చాలా బాగారాశారు. :)

    ReplyDelete
  4. స్పందించిన మిత్రులందరికీ ధన్యవాదాలు.!

    ReplyDelete
  5. అందమైన ప్రశ్నలు మీవే..చక్కనైన జవాబు మీదే...బావుందండి మీ కవిత.

    ReplyDelete
  6. నాకు బాగా నచ్చింది. ప్రేమ కవితలు ఎన్నో చదివాను. ఎక్కువ రొటీన్ గానే ఉంటాయి. ఇది కొత్తగా ఉంది.

    మీ భావం కూడా బాగుంది.

    ReplyDelete
  7. @ సవ్వడి, రాధిక గారూ,
    ధన్యవాదాలండీ!

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!