Friday, August 28, 2009

జీవితమంటే..!?

-->
నేను: "అబ్బా.. సుత్తి జీవితం ఏంటో.. మహా చిరాగ్గా, విసుగ్గా, విరక్తిగా అనిపిస్తోంది."
తను: "జీవితం మంచిదే.. మనమే అనవసరంగా అన్నీ కల్పించుకుని మరీ జీవితాన్ని అలా విరక్తి కలిగేలా తయారుచేసుకుంటాం."
నేను: "అన్నీ వదిలేసి ఎక్కడికైనా దూరంగా పారిపోవాలనిపిస్తుంది."
తను: "నీ మనసులోని అనవసరమైన ఆలోచనలని దూరం చేసేవరకూ ఎంతెంత సుదూర తీరాలకు వెళ్ళినా నీకు ప్రశాంతత దొరకదు."
నేను: "నా చుట్టూ ఉన్నవాళ్ళ గురించి ఆలోచించడం అనవసరమా.!?"
తను: "అనవసరమే.. ఆలోచనల్లో పడి కొట్టుకుపోతూ నువ్వు జీవించడం మర్చిపోయే పరిస్థితిలో నువ్వు పడ్డప్పుడు"
నేను: "మరో వ్యక్తికి నేను ఏమనుకుంటున్నానో తెలియచెప్పాలనుకోవడం తప్పా.!?"
తను: "తెలియచేయాలనుకోవడం తప్పు కాదు. కానీ, వాళ్లు ఖచ్చితంగా నిన్ను అర్ధం చేసుకుని తీరాలని ఆశించడం తప్పే మరి.!"
నేను: "అయితే, నన్నువేరేవాళ్ళు అర్ధం చేసుకోవాలని నేను తాపత్రయపడటం అర్ధరహితమా.!?"
తను: "చూడు బంగారం.. ప్రపంచంలో ఎవరైనా ముందు తమ స్వాభిప్రాయాన్నే గౌరవించుకుంటారు, తమ భావానికే విలువ ఇచ్చుకుంటారు. దానికి అనుకూలంగా ఉంటేనే వేరేవాళ్ళు చెప్పినదానికి అంగీకరిస్తారు. లేకపోతే అభిప్రాయబేధం తప్పదు, అది ఎవరితోనైనా సరే.! దీన్నే మరో విధంగా చెప్పాలంటే.. ప్రతీ మనిషి మొదట తన కోసం తాను జీవిస్తాడు. తనకు సరి అనిపిస్తేనే గానీ, అప్పుడు మరో వ్యక్తి భావాల గురించి ఆలోచించడు. తననేవాడే లేకపోతే, అసలు ఇక మిగతా మనుషుల, విషయాల ప్రసక్తే లేదు కదా.!
కాబట్టి, ప్రతీ మనిషి తనదైన స్వంత ఆలోచననీ, భావాన్ని, అభిప్రాయాన్ని కలిగిఉండటం అత్యంత సహజం. అదే లేకపోతే, మనిషికీ, మన్నుకీ తేడా ఏముంది చెప్పు. మన ఆలోచనని ఎవరైనా అర్ధం చేసుకుంటారా లేదా అన్న దాన్ని ఆధారం చేసుకుని మనం ఆలోచన చేయకూడదు. నువ్వు నీలా ఆలోచించాలి, నీలా ఉండాలి. లేని పక్షంలో అసలు 'నువ్వు' అనే మనిషివి అదృశ్యమైపోయి మరెవరి ఆలోచనలకో ప్రతిబింబంగా మాత్రమే మిగిలిపోతావు. సృష్టిలో ప్రతీ జీవి ప్రత్యేకమే. ప్రత్యేకతని పోగొట్టుకోకుండా జీవించగలగడమే మన జీవితానికి నిర్దేశించబడిన అసలైన అర్థం పరమార్థం.

మరో మాట చెప్పనా బంగారం... మనం అతిగా ఆలోచించేంత పేద్ద విషయం కాదు జీవితం. మొత్తం ప్రపంచానికే మహనీయులైన వ్యక్తులు లోకం నుంచి నిష్క్రమిస్తే అందరం ఒక వారం లేదా మహా అంటే ఒక నెల బాధపడతాం. సొంత కుటుంబసభ్యులే పోయినా కూడా, వాళ్ళతో మనం పోలేము. కాసేపు బాధపడ్డాక మళ్ళీ బ్రతుకు పరుగులో పయనం సాగించాల్సిందే. అది జీవికైనా అనివార్యం. అంతెందుకు. మనమే పోయినా గానీ, ప్రపంచంలో ఏమీ మార్పు ఉండదు. జరిగేవన్నీ జరుగుతూనే ఉంటాయి. దీన్ని బట్టి ఇంత పెద్ద అనంత విశ్వంలో మనకున్న విలువెంత.?

అలాగే మరో మాట.. నీకు కేవలం ఒక్కరోజే ఆయుష్షు మిగిలిఉందని తెలిస్తే ఏం చేస్తావు.?సాధ్యమైనంత సంతోషంగా, నీకు నచ్చినట్లుగా ఉండాలనుకుంటావు కదా.! అదే ఎప్పుడు పోతామో తెలీనప్పుడు మాత్రం జీవితాన్ని ఆస్వాదించడం మానేసి ఇలా వ్యర్ధమైన ఆలోచనలతో విలువైన సమయాన్ని వృథా చేస్తాము. మన జీవితం శాశ్వతం కాదు..మనకున్న కొద్ది కాలాన్ని అందంగా, ఆనందంగా మార్చుకోవడం మన చేతుల్లో మాత్రమే ఉంది. మన జీవితం ఎలా ఉండాలన్నది కేవలం మనం మలచుకొనేదే.!

కాబట్టి, మన జీవితానికున్న విలువను గుర్తించి, అలాగే మనకి లేని అతి విలువని అతిశయంగా ఆపాదించుకుని బీరాలు పోతూ అతిగా ఆలోచించి జీవితాన్ని విసుగ్గా, విరక్తిగా మార్చుకోకుండా, అదే సమయంలో మన ప్రత్యేకతను మనం పోగొట్టుకోకుండా హాయిగా జీవితాన్ని ఆస్వాదించాలి. అదే.. ఇంత ఆలోచించగలిగే మెదడు, స్పందించగలిగే మనసు ఉన్న మనుషులుగా పుట్టినందుకు మనకు లభించిన అదృష్టం.

ఇప్పుడు చెప్పు.. జీవితాన్ని ఒకసారి నే చెప్పిన కోణంలో నుంచి చూసే ప్రయత్నం చేస్తావు కదూ..!!"

నేను: "జీవితాన్ని ఇంత అందంగా, ఆనందంగా చూపిస్తుంటే.. కాదని అనగలనా.!?"

21 comments:

  1. chala baaga raasaarandee...nenu ...daggara nijamga nene ..okkokkasaari.

    ReplyDelete
  2. చాలా బాగుంది..
    మీరు-మీ అంతరాత్మ రైట్??
    అద్దం ముందు నిలబడి ఆత్మ శోధన...

    ReplyDelete
  3. బాగుంది.. సింపుల్ గా చెప్పాలంటే అంతే కదా జీవితం,

    ReplyDelete
  4. ఆమొదటి లైన్ ని ఎన్నిసార్లు అనుకొని ఉంటానో లెక్కేలేదు.. బావుంది

    ReplyDelete
  5. బాగా రాశారండి...
    కానీ కొన్ని చోట్ల నేను మీతో ఏకీభవించలేను...
    నేను నాకోసమే బ్రతుకుతాను అంటే ప్రస్తుత సమాజంలో ఎవ్వరము జీవనం సాగించలేము.
    మనకు తెలియకుండానే మన ప్రభావం వేరే వాళ్ళ మీదనో...లేదా వాళ్ళ ప్రభావం మన మీదనో ఉండే ఉంటుంది...అంటే..మనము మన మనసుని ఎంత కంట్రోల్ చేసుకున్న కానీ కొన్ని ఆలోచనలు మనకు తెలియకుండానే మన మనసులో చేరిపోతాయి...వాటి నుండి తప్పించుకోలేము....సమయానికి అనుకూలంగా స్పందిస్తూ ప్రతీ క్షణాన్ని ఆస్వాదిస్తూ...జీవితాన్ని సంతోషం గ గడిపేయాలి...
    మీ పోస్ట్ చదువుతుంటే నాకు అనిపించిన భావాలు ఇవి...

    ReplyDelete
  6. చాలా బాగుంది..

    ReplyDelete
  7. చాలా బాగుందండి...కొన్ని చోట్ల మీలో నేనూ ఉన్నాను అనిపించింది.

    ReplyDelete
  8. ఎంత మధురంగా చెప్పారండి!

    ReplyDelete
  9. జీవితం గురించి ఇంత అందంగా, ఆనందంగా చెబుతుంటె.. కాదని అనగలమా!

    ReplyDelete
  10. బాగా రాసారు.
    ఇలాంటివి చదవగానే కొంచం ధైర్యం వస్తుంది.
    మరునాడు అంతా మామూలే

    ReplyDelete
  11. మధుర వాణి గారు
    జీవితం గురించి చాలా చక్క గా చెప్పారు

    ReplyDelete
  12. ఆలోచించగలిగే మెదడు, స్పందించగలిగే మనసు ఉన్న మనుషులుగా పుట్టినందుకు మనకు లభించిన అదృష్టం.బాగా రాసారు.

    ReplyDelete
  13. నిజమేనండి..శాశ్వతం కాని మన జీవితంలో విలువైన సమయాన్ని వ్యర్ధమైన ఆలోచనలతో వృధా చేసేస్తాము.
    లేని పోనీ అతిశయాలకి పోకుండా, మన జీవితానికున్న విలువను గుర్తించి, హాయిగా జీవితాన్ని ఆస్వాదించాలి. చాలా బాగా చెప్పారు.

    ReplyDelete
  14. అద్భుతమైన ప్రాక్టికల్ ఫిలాసఫి!

    ReplyDelete
  15. ఇన్నాళ్ళు మీ బ్లాగుని ఎలా మిస్సయ్యానో అర్థం కావట్లేదు.

    ReplyDelete
  16. jeevitha satyanni saralamaina telugu lo adbhutam ga chepparu...

    meeru rasina e vyasam prati okariki tappakunda nachutundi :-)

    ReplyDelete
  17. Jeevitham gurinchi entha bhaga chepparu...
    (Expect nothing and u will never be disappointed)

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!