Monday, February 23, 2009

భారతీయ సంగీతానికి ఒకేసారి రెండు ఆస్కార్ అవార్డులు దక్కిన చారిత్రాత్మక క్షణాలు..!! జయహో రెహమాన్..!!!


AR రెహమాన్... ఈ రోజు ప్రపంచం అంతా.. మన భారతదేశం వైపు తిరిగి చూసేలా చేసిన సంగీత తరంగం. 'స్లం డాగ్ మిలియనీర్' సినిమాకి గానూ, ఉత్తమ నేపథ్య సంగీతం (బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్), ఉత్తమ గీతం (బెస్ట్ సాంగ్ - జయహో) రెండు ఆస్కార్ అవార్డులు గెలుచుకున్నాడు. ఇది ప్రతీ ఒక్క భారతీయుడు ఆనందిచదగ్గ, గర్వించదగ్గ విషయంcelebrate

AR రెహమాన్ సంగీతం గురించి ఏ భారతీయుడికీ కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదని అందరికీ తెలిసిందే. ఎన్నో విషయాల్లో రెహమాన్ ని మనందరం స్పూర్తిగా తీసుకోవాలి. వృత్తి పట్ల గౌరవం, నిబద్దత, కష్టపడటం, నిజాయితీ, అంకిత భావం, ఎంత ఎదిగినా ఒదిగి ఉండే గొప్ప మనస్తత్వం... ఇవన్నీ అలవర్చుకున్న మనిషి ఎంతటి ఉన్నత శిఖరాలనైనా అధిరోహించగలడు అని చెప్పడానికి రెహమాన్ ఒక నిలువెత్తు నిదర్శనం.


మన భారతదేశ కీర్తిపతాకని అంతార్జాతీయ వేదికపై రెపరెపలాడించిన మన AR రెహమాన్ కి ఇదే నమస్సుమాంజలిtepuktangan మనందరి తరపునా అభినందన మందారమాలలుros ...!!

మన రెహమాన్ ఆస్కార్ అవార్డ్స్ అందుకున్న క్షణాలని ఈ క్రింది వీడియోలో చూడచ్చు.

1 comment:

  1. ఆలస్యంగా అయినా అవార్డు వచ్చింది. సంతోషకరమైన విషయం..

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!