పైన కనిపించే డైలాగ్ కి అర్ధం ఏంటని నన్ను మాత్రం అడక్కండి. ఎందుకంటే.. ఆ డైలాగ్ నాది కాదు మరి. అప్పుడెప్పుడో ఒకసారి 'బంగారం' అని చెప్పాను కదా.. తన డైలాగ్ అన్నమాట..! ఇంతకీ బంగారం ఎవరు చెప్మా.. అనుకుంటే మాత్రం ఇక్కడకెళ్ళి చూడండి. హమ్మయ్యా... ఇప్పుడు గుర్తొచ్చేసింది కదా..! సరే అయితే ఇంక నేరుగా విషయంలోకి వెళ్ళిపోదాం. మరేమీ లేదండి... బంగారం మనకి ముచ్చట్లు చెప్తానంది కదా... సరేననుకొని చెప్పమని అడిగితే.. ఈ డైలాగ్ కొట్టింది :( ఏంటమ్మా సీతామహాలక్ష్మీ.. ఏదో ముచ్చట్లు చెప్తావ్ కదా అని అడిగితే అలా అనేసావ్..? అయినా నీ ముద్దుపేరు 'బంగారం' అని మాకందరికీ తెలుసు కదా..! ఏంటీ కథ.. అని కడిగేసాను..సారీ..అడిగేశాను. అప్పుడు తనేమి చెప్పిందో తన మాటల్లోనే వినండి మరి.. :)
ఈ మధ్యన ఒక రోజు ఏమయిందంటే.. నేను తీరిగ్గా మెయిల్ చెక్ చేసుకుంటూ ఉండగా..నా కాలేజీ క్లాస్ మేట్ కమల కుమారి చాలా రోజుల తరవాత ఆన్ లైన్లో కనిపించింది. ఎప్పుడూ పెద్దగా మాట్లాడనిది దానంతట అదే మాట్లాడిందేంటి చెప్మా అనుకుంటూ సందేహంగానే మాట్లాడడం మొదలెట్టాను. దానికి ఈ మధ్యనే కొత్తగా పెళ్లి అయిందిట. వాళ్ళాయన అమెరికాలో పెద్ద సాప్ట్ వేర్ ఇంజనీర్ అని పేద్ద బడాయిగా చెప్పింది. అంటే.. వాళ్ళాయన గురించి గొప్పగా చెప్పుకోవచ్చనుకో.. కానీ, నీకు తెలుసా సీతా.. అమెరికానే కాదూ.. ఏ దేశంలోనయినా సాప్ట్ వేర్ ఇంజనీర్లకే ఎక్కువ డిమాండ్ ఉంటుందంట. ఎక్కువ డబ్బులిస్తారంటా తెలుసా.. అంది. అంతే కాదు.. మా రాంబీ (భయపడకండి..అది వాళ్ళాయన్నిపిలిచే ముద్దు పేరట.. అసలు పేరు రాంబాబు అంట :) నన్ను కూడా ఒక 2 మంత్స్ కోర్స్ చేయమంటున్నాడు. అప్పుడు నాకు కూడా నెలకి 10k ఇచ్చే జాబ్ వస్తుందంట తెలుసా.. అంది. అవునా.. అయితే మంచిదేగా.. అన్నాను నేను. కానీ, అక్కడితో ఆపకుండా.. సైన్సు కి సంబంధించిన వాళ్ళకి పాపం చాలా తక్కువ డబ్బులొస్తాయంట తెలుసా.. అన్నట్టూ మీ హబ్బీ (ఇంగ్లీసు దొరసానిలాగా.. ఆయన..గీయన..అని మేము అనం తెలుసా అని చాటింపు వేస్తున్నట్టుగా వినిపించింది నాకు) కూడా సైన్సు కి సంబంధించిన జాబే చేస్తారనుకుంటా కదా అంది. ఇంక చూడండి.. నాకు తిక్క నషాలానికంటింది. మనకసలు వెనక్కి తగ్గే అలవాటే లేదు కదా.. అవునులే మా ఆయనలాంటి వాళ్లు పాపం చచ్చీ చెడీ..రీసెర్చ్ చేసి అన్నీ కనిపెడుతుంటే కొంతమంది ఆ ఫలితాల్ని బాగా అనుభవిస్తూ సోమరిపోతుల్లాగా బతకడమే కాకుండా.. వాళ్ల విలువని కూడా తెలుసుకోలేరు.. అన్నాను. ఈలోపు వెంటనే అది ఒక్క నిమిషం సీతా.. రాంబీ కాల్ చేసాడు అంది. ఒక రెండు నిమిషాలు గడిచాక ఏం లేదు సీతా.. మా రాంబీ కాసేపు కూడా నాతో మాట్లాడకుండా ఉండలేడు. ఎప్పుడూ కుమ్మీ.. కుమ్మీ.. ( అంటే 'కమల కుమారి' కి ముద్దుపేరని మీరు అర్ధం చేసుకోవాలని మనవి) అంటూ నా చుట్టూనే తిరుగుతుంటాడు అంది. (అలా అనగానే నాకేదో తేడాగా వినపడింది.. మీరు మాత్రం దయచేసి అలా అనుకోకుండా ఉండడానికి ప్రయత్నించండి :) అంతటితో ఆగకుండా.. నీకు తెలుసా సీతా.. ఇక్కడెవరూ బుజ్జి, చిట్టి, బంగారం, సింగారం అని పాత చింతకాయ పచ్చడి పేర్లతో పిలుచుకోరట. అందుకే మా రాంబీ నన్ను ఎప్పుడూ కుమ్మీ కుమ్మీ.. అని పిలుస్తుంటాడు అంది. మా రాంబీ వాళ్ల ఆఫీసు లో వాళ్ళందరికీ నన్ను కుమ్మీ అని పరిచయం చేయగానే ఎంత థ్రిల్ అయ్యారో తెలుసా.. వాళ్ల బాస్ డంకీ (మీరు సరిగ్గానే విన్నారు) అయితే మరీనూ.. వాటే ఇన్నోవేటివ్ నేమ్ అని తెగ మెచ్చేసుకున్నారు తెలుసా.. ఇంకా రాంబీ ఫ్రెండ్స్ అయితే నీ వైఫ్ ని కుమ్మీ అని పిలుస్తావంట కదా.. వాటే రొమాంటిక్ నేమ్.. అని రోజుకొకసారైనా పొగుడుతుంటారు తెలుసా.. అని చెప్పి ఊపిరి తీసుకోవడానికి ఒక రెండు సెకన్లు గ్యాప్ ఇచ్చింది. హమ్మయ్య.. కాస్త సందు దొరికింది కదా.. అని వెంటనే చాకచక్యంగా కమ్మీ..సారీ.. కుమ్మీ.. నేను అర్జెంటుగా బయటికెళ్ళాలి. బస్ టైం అయింది. మళ్ళీ కలుస్తాను అని చెప్పేసి మరుసమాధానం కూడా వినకుండా టక్కున మెయిల్ సైన్ ఔట్ చేశాను. అయ్య బాబోయ్.. కుమ్మీ దెబ్బకి తల నిజంగా దిమ్మెక్కిపోయింది.. ఒక కప్పు బ్రూ కాఫీ తాగాక గానీ నేనెవరో.. ఎక్కడున్నానో గుర్తొచ్చింది :(
ఈలోపు నేను మన బంగారాన్ని అడిగాను. ఇదంతా సరే గానీ.. మరి 'నా ముద్దు పేరు అడక్కండీ' అని ఎందుకన్నావ్?? అని. అక్కడికే వస్తున్నామరి.. ఆ రోజు సాయంత్రం నాకూ, మా శ్రీవారికీ మధ్య జరిగిన ముచ్చట చెప్పనివ్వు.. నీకే తెలుస్తుంది అలా ఎందుకన్నానో.. అంది. ఆ ఎపిసోడ్ కూడా చూసేద్దామా.. సారీ.. వినేద్దామా మరి.. :) నాక్కూడా ఒక కప్పు బ్రూ కాఫీ ఇచ్చి మళ్లీ చెప్పడం మొదలెట్టింది సీత.
ప్రతి రోజూలాగానే ల్యాబ్లో ఉదయం నుంచి మెదడుని చిలికీ చిలికీ సాయంత్రం ఏడింటికి శ్రీవారు ఇంటికొచ్చారు. ఎప్పుడో తప్ప ఎక్కువగా మాట్లాడడు రఘు. నేను మాత్రం తను ఇంట్లో ఉన్నంతసేపు ఏదో నా శక్తిమేరకు శ్రవణానందాన్ని కలగజేయడానికి ప్రయత్నిస్తుంటాను రోజుకో కొత్త టాపిక్ మాట్లాడుతూ. తనేమో కట్టే, కొట్టే, తెచ్చె అన్నట్టుగా మధ్య మధ్యలో తన ఉనికిని చాటుకుంటూ ఉంటాడు :) ఆ కార్యక్రమంలో భాగంగా మొదటి ప్రశ్న సంధించాను. రఘూ.. నిన్నెప్పుడైనా ఎవరైనా నీ ముద్దు పేరేంటని గానీ.. మీ ఆవిడని ఏ ముద్దుపేరుతో పిలుస్తావని గానీ అడిగారా? అని అడిగాను. ఏదో వింత జపానీ వంటకం కొత్తగా ట్రై చేసి ముందుగా తననే రుచి చూడమన్నట్టుగా పెట్టాడు మొహం. 'అడగలేదు' అన్నాడు. అలా కాదు రఘూ.. ఒకవేళ ఎవరైనా అడిగారనుకుందాం.. అప్పుడేమి చెప్తావు అన్నాను. నేను మా ఆవిడని ఏ పేరుతో పిలిస్తే నీకెందుకురా గొట్టం.. అంటాను అన్నాడు. హబ్బా.. అని ఒకసారి తల కొట్టుకుని.. అలా కాదు రఘూ.. ఒకవేళ నీకు బాగా దగ్గర స్నేహితుడో.. లేకపోతే మీ అక్కో.. అడిగారనుకో.. అప్పుడు ఆ సమాధానం చెప్పలేవు కదా.. అన్నాను. 'మీ ఆయన నిన్ను ఏ పేరుతో పిలుస్తాడని నేనెప్పుడైనా నిన్ను అడిగానా' అని అంటాను అన్న సమాధానం బుల్లెట్ లాగ దూసుకొచ్చింది రఘు దగ్గర్నుంచి. హత విధీ.. మరీ చోద్యం కాకపోతే.. ఈయన లాగే అందరూ ఉంటారా.. ఏదో కుతూహలం కొద్దీ అడగచ్చు కదా.. అది అంత ఘోరమైన ప్రశ్న కాదుగా :( ఇదే మాట రఘుతో అన్నాను. సరే.. సరే.. ఇప్పుడు నేను పిలిచే నీ ముద్దు పేరేంటో చెప్పాలంటావు.. అంతేనా.. అప్పుడు గానీ ఈ టాపిక్ కి శుభం కార్డు పడేలాగా లేదు.. అన్నట్టుగా మొహం పెట్టి చెప్పడం మొదలెట్టాడు. నేను నిన్ను రోజూ వంద పేర్లతో సరదాగా పిలుస్తుంటాను కదా.. జుంబా-జంబలా, చింగిరీ-టింగిరీ, కోయా-చూయా, చిచ్చీ-గిచ్చీ.. అనీ..వీటిల్లో ఏదయినా ఒకటి చెప్పాలంటావా ? లేదా అన్నిటినీ ఒక లిస్టు లాగ రాసుకుని బట్టీ కొట్టేసి అడగ్గానే అప్పజేప్తే బెటర్ అంటావా? అన్నాడు రఘు. ఇంక చూడండీ.. అప్పుడు నా మొహం చూడాలి... ఒక యాభై జపాన్ వంటకాలన్నీ కలిపి తినేసినట్టు పెట్టాను మొహం :( ఏరి కోరి భలే చేసుకున్నాను.. పైగా మళ్ళీ చక్కగా తరచి తరచి నేనే సుత్తి ప్రశ్నలన్నీవేశాను.. బాగా తిక్క కుదిరింది నాకు.. అనుకుంటూ కనీసం స్టౌ మీదున్న కూరనన్నా సరిగ్గా అయ్యేట్టు చూద్దామని అక్కడి నుంచీ వెళ్లి వంటింట్లో దూరాను. అప్పుడొక అయిదు నిమిషాలు మౌనంగా గడిచాయి. రఘుని ఏరి కోరి చేసుకున్నందుకు నన్నూ.. నన్ను ప్రేమించానని చెప్పి, అష్ట కష్టాలు పడి అందర్నీ ఒప్పించి మరీ నన్ను పెళ్లి చేసుకున్నందుకు రఘునీ.. ఆ అయిదు నిమిషాల్లోనే ఒక కోటి సార్లు మనసులోనే తిట్టేసుకున్నాను. ఈలోపు రఘు వచ్చాడు వంటింట్లోకి. అవసరం లేకపోయినా కూర కలియబెడుతూ.. అసలేమీ ఫీల్ అవ్వనట్టూ.. చాలా మాములుగా ఉన్నట్టు.. చాలా కష్టపడి నటించాను. వెనకనుంచి వచ్చి తన చేతుల్తో చుట్టేస్తూ.. 'బంగారం.. నా బుజ్జి బంగారం.. నా చిట్టి బంగారం.. ఊరికే సరదాకి అన్నానే. ఈ అయిదు నిమిషాల్లో కనీసం కోటి తిట్లయినా తిట్టుకున్నావా నన్ను ప్రేమించినందుకు.. నన్ను కూడా తిట్టే ఉంటావులే.. లేకపోతే సీతామహాలక్ష్మివెలా అవుతావు.. అందుకే కదా మరి నిన్ను ప్రేమించింది' అన్నాడు రఘు.. అన్నట్టు ఈసారి ఎవరన్నా మీ ఆవిడ ముద్దు పేరేంటి అని అడగడం ఆలస్యం.. ఇందాక చెప్పిన పేర్లన్నీ రాసి ఒక ప్రింటౌట్ తీసి మరీ ఇస్తాను. ఇప్పుడు ఓకే కదా.. అన్నాడు. నేను వెంటనే హి హి హ్హీ.. అని ఒక డజను ముత్యాలు రాల్చేసాను. నన్ను ఎవరూ అడక్కపోయినా సరే.. పంది, కుక్క, ఎద్దు, దున్నపోతూ.. ఇవన్నీ రాసి ప్రింటౌట్ తీసి నీ ముద్దుపేర్ల లిస్టు అని చెప్పి మీ ఆఫీసులో అమ్మాయిలందరికీ పంచేస్తాను అని చెప్పాను. ఆ తరవాత ఇంకేముందీ... 'కుమ్మీ' గురించి కబుర్లు చెప్తూ మేము టమాటా పప్పు, ఆవకాయ, అప్పడం తో భోజనానికీ.. మీరేమో.. ఇంటికి..అని గలగలా నవ్వేసింది సీత. మా రఘు తక్కువగా మాట్లాడినా.. నిజంగా నేనంటే బోలెడంత ప్రేమ తెలుసా.. అని మురిసి ముక్కలయిపోతూ చెప్పింది.
ఏమో అనుకున్నా గానీ.. మన బంగారం గడుసు పిండమేనండోయ్ ..!! అని నేననుకున్నాను. ఇవాళ్టికి బంగారం ముచ్చట్లు ఇక చాలించి నేను సెలవు తీసుకుంటున్నా మరి..!
ప్రేమతో...
మధురవాణి
బాగుందండీ ముద్దుపేరు కథ. నాకు సినిమాలగురించి నాలెడ్జి లేదులెండి. కానీ హబ్బీలాటివి పరిచయమే. నాకు అన్నిటికంటే తమాషా అనిపించింది నా శివుడాజ్ఞకథలో ఎందుకులెండి గారి వ్యాఖ్య చూస్తే మీకే తెలుస్తుంది. అలాటివాళ్లు వున్నారని మీరు కూడా గుర్తించి నలుగురికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు.
ReplyDeleteమీశైలికి అభినందనలు.
బాగుందండీ ముద్దుపేరు కథ. నాకు సినిమాలగురించి నాలెడ్జి లేదులెండి. కానీ హబ్బీలాటివి పరిచయమే. నాకు అన్నిటికంటే తమాషా అనిపించింది నా శివుడాజ్ఞకథలో ఎందుకులెండి గారి వ్యాఖ్య చూస్తే మీకే తెలుస్తుంది. అలాటివాళ్లు వున్నారని మీరు కూడా గుర్తించి నలుగురికీ తెలియజేసినందుకు ధన్యవాదాలు.
ReplyDeleteమీశైలికి అభినందనలు.
మాలతి గారూ,
ReplyDeleteనేను రాసింది ఓపికగా చదివి మీ అభిప్రాయాలు వెల్లిబుచ్చినందుకు ధన్యురాలిని. వాస్తవానికి ఇదే నా మొదటి ప్రయత్నం. మీ ప్రోత్సాహానికి కృతజ్ఞతలు.
madhura vani garu
ReplyDeleteme bangaramu nijanga bangaram la chala bagundandi.me katha,a katha ni meru cheppina teeru naku baga nachindandoyiii
భరత్ గారూ,
ReplyDeleteథాంక్స్ అండీ.. ఏదో మీ అభిమానం :)
బ్లాగు మొదలు పెట్టినప్పటి నుంచీ ప్రతీ పోస్టులోనూ మీ ప్రోత్సాహం నాకు లభిస్తూనే ఉంది. చాలా సంతోషం.
నిజానికి మీ అభిప్రాయం కోసం నేను అదురు చూస్తున్నాను ఈ పోస్ట్ చేసినప్పటి నుండి :)
mee muddu peru aenti madhura vani garu..:))))
ReplyDeleteachhu naa story laane vundi kaakapothe last lo aa koora kaliyabetti thananu garaabam cheyadam maathram ledu.
ReplyDeletechala baagundhi
ReplyDeletekatha chala bagundi........intena bangaram muchatlu........
ReplyDeleteme story bavundhi... idhi chaduvthu vunte naku na chinnathanam gurthostundhi... nenu ilage chala kathalu aashuvuga cheppedanni, but I've never tried to pen down them.
ReplyDeleteIppudu me katha chadivaka naakuu malli rayadam modalu pettalani anipistundhi :)