Tuesday, December 16, 2008

నవ్వాలి నీతో.. నడవాలి నీతో.. నెలవంక మీద నిలవాలి నీతో..!!

ఇప్పుడు నేను చెప్పబోయే పాట 'నీతో' అనే ఒక అట్టర్ ఫ్లాప్ సినిమాలోనిది. దర్శకేంద్రుడు K. రాఘవేంద్రరావు గారి కుమారుడైన సూర్యప్రకాష్ ని సినిమాతో హీరోగా పరిచయం చేసారు. మళ్ళీ చాలా కాలం తరువాత షబానా ఆజ్మీ నటించిన 'రాగం' అనే సంగీత ప్రధానమైన చిత్రంలో కూడా నటించినట్టున్నాడు హీరో. మొత్తానికి రెండు సినిమాలూ నేను చూళ్ళేదు. కాబట్టి అతని నటనని గురించి ఏమీ చెప్పలేను. కానీ.. అప్పట్లో సినిమాని చూళ్లేక జనాలు ఇబ్బంది పడినట్టు గుర్తు :) సినిమాని 2002 లో ఉషాకిరణ్ మూవీస్ బ్యానర్ పై రామోజీరావు గారు నిర్మించారు. అందుకే అప్పట్లో ఈటీవీలో చిత్రానికి సంబంధించిన ప్రోమోస్ బాగా వచ్చేవి. ఒక సారి ఆలోచిస్తే మీకు గుర్తొచ్చే అవకాశం కూడా ఉంది. ఇది పెద్ద కళాఖండం కాదు కాబట్టి.. అంత శ్రమపడాల్సిన అవసరం కూడా లేదనుకోండి :)



ఏది ఏమయినా.. నేను చెప్పబోయేది పాటల గురించి కాబట్టి.. సంగతుల్లోకి వెళ్తే.. సినిమా హిట్ అవ్వకపోవడం వల్ల.. పాటలు కూడా అజ్ఞాతంలోనే ఉండిపోయాయి పాపం :( సినిమాకి సంగీతాన్ని విద్యాసాగర్ గారు అందించారు. 'నవ్వాలి నీతో.. నడవాలి నీతో..' అనే పాటకి సాహిత్యం చంద్రబోస్ అందించారు. సున్నితమైన భావాల్ని.. చాలా మామూలు మాటల్లో చెప్తూ.. బోలెడంత ప్రేమని.. అమ్మాయి మీద కురిపిస్తూ అబ్బాయి పాడే పాట ఇది. పాట ఒక భావయుక్తమైన ప్రేమ గీతం. హరిహరన్ గారు చాలా చక్కగా ఆలపించారు. ఒకసారి విని చూడండి. మీకు కూడా నచ్చే అవకాశం ఉంది.

నవ్వాలి నీతో.. నడవాలి నీతో..

నెలవంక మీద నిలవాలి నీతో..
ఆడాలి నీతో.. అలగాలి నీతో..

హరివిల్లు మీద ఊగాలి నీతో..
తడవాలి నీతో.. ఆరాలి నీతో..

గడపాలి అనుక్షణం నేనే.. నీతో..


నవ్వాలి నీతో.. నడవాలి నీతో..
నెలవంక మీద నిలవాలి నీతో..


వస్తానని మాటిచ్చాకా.. కావాలని నే రాలేక..

నీలో చాలా ఆరాటాన్నే పెంచాలి..

వేరే కన్నెను నేనింక.. వంకర చూపులు చూసాక..

నీలో కలిగే ఆక్రోశాన్నే కాంచాలి..


నీ పైట గాలిని పీల్చాలి..

నీ మాట తేనెను తాగాలి..

నునులేత చీవాట్లు తింటా.. నీతో..

నవ్వాలి నీతో.. నడవాలి నీతో..

నెలవంక మీద నిలవాలి నీతో..
ఆడాలి నీతో.. అలగాలి నీతో..

హరివిల్లు మీద ఊగాలి నీతో..

చీటికి మాటికి ఊరించి.. చిలిపితనంతో ఉడికించి..

ముద్దుగ మూతిని ముడుచుకునుంటే.. చూడాలి..

.. అంతకు అంతా లాలించి.. పై నీపై తల వాల్చి..

బ్రతిమాలేస్తూ జతగా నీతో బ్రతకాలి..


నీ వేలి కొనలను నిమరాలి..

నీ కాలి ధూళిని తుడవాలి..

అరచేతి గీతల్లే ఉంటా.. నీతో..


నవ్వాలి నీతో.. నడవాలి నీతో..

నెలవంక మీద నిలవాలి నీతో..
తడవాలి నీతో.. ఆరాలి నీతో..

గడపాలి అనుక్షణం నేనే.. నీతో..!!

అజ్ఞాత గీతాన్ని ఓసారి విని చూడండి. మీకు ముందే తెలిసి ఉంటే.. మరోసారి గుర్తు చేసుకోండి :)


7 comments:

  1. ఒకప్పుడు ఈ పాట వినేవాడిని ..కాని ట్యూన్ మర్చిపోయా..డౌన్ లోడ్ చేసి విన్నా..మంచి పాట!!!

    ReplyDelete
  2. this is one of my favorite song..

    happy to see this here !!

    ReplyDelete
  3. మధుర వాణి గారు
    మన బంగారం కోసం ఆత్రం గా ఎదురు చుస్తునానండి...
    అలగే మీ గురించి ఇంకొంచం తెలుసుకోవాలని ఉందండి
    నా మనవి ని మన్నిస్తారని ఆశిస్తున్నాను

    ReplyDelete
  4. very nice song. It's a cool idea by you. I like the song of Nagarjuna you introduced in old post.

    How about this one? See link...

    http://thinkquisistor.blogspot.com/2008/11/blog-post_26.html

    konchem ee flop song nee parichayam chedduroo...! :-)

    ReplyDelete
  5. గీతాచార్య గారూ..
    ఇది మీరు రాసిన కవితనుకుంటా కదా.. చాలా బావుందండీ..!
    మీరు "కొంచెం ఈ ఫ్లాప్ సాంగ్ ని పరిచయం చేద్దురూ" అని అంటే.. నిజంగా ఏదో పాట అనుకున్నాను. ఎప్పుడూ వినలేదే.. అని ఆలోచిస్తున్నాను.
    అయితే మీరు జోక్ చేసారన్నమాట :)

    ReplyDelete
  6. భరత్ గారూ,
    మీ అభిమానానికి సంతోషం :)
    మన బంగారం బిజీగా ఉన్నట్టుందండీ :)
    నా ప్రొఫైల్ లో నా గురించిన మరిన్ని వివరాలు చూడచ్చు.
    you can also reach me at priyanestham4u@googlemail.com

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!