Thursday, November 27, 2008

అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం..!!

ఈ వేళ ఘంటసాల గారి గానామృతాన్ని మీకు గుర్తు చేస్తున్నాను. "అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం" అనే పాట 1953 లో వచ్చిన 'బ్రతుకు తెరువు' అనే చిత్రంలోనిది. చక్కటి పాటని ఘంటసాల గారు స్వీయ సంగీత దర్శకత్వం వహించి స్వయంగా ఆయనే ఆలపించారు.

ఆహా
జీవితం ఎంత ఆనందం..అపురూపం.. అనిపిస్తుంది పాట వింటుంటే.. చెవిలో తేనె పోస్తున్నట్టుగా ఉండడం అంటే ఏంటో పాట వింటే తెలుస్తుంది మనకి. సముద్రాల (రామానుజాచారి) జూనియర్ సాహిత్యం అత్యంత సరళమైన పదాలతో.. చాలా భావయుక్తంగా ఉంటుంది. పాట ఆయన సినిమాలకి రాసిన మొట్టమొదటి పాట. గానగంధర్వుడైన ఘంటసాల గానం గురించి చెప్పగలిగేంత భాష నాకు ఎలాగూ రాదనుకోండి..! మరో సంగతి ఏంటంటే సినిమాలో ఇదే పాటని P.లీల గారు కూడా పాడారు. కానీ మనం సాధారణంగా ఎప్పుడూ ఘంటసాల గారిదే వింటూ ఉంటాం. పాట కూడా బావుంటుంది చాలా.. విని చూడండి మీరే..!

రాజీ పడని జీవితం ఎవరికైనా లేదు. విషయం ఆధారంగా కొద్దిగా మార్పులతో చాలా సినిమాలు వచ్చాయంట కాలంలో.. వాటిల్లో 'బ్రతుకు తెరువు' సినిమా కూడా ఒకటి. సినిమాకి PS రామకృష్ణ గారు (భానుమతి గారి భర్త) దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ANR హీరోగా నటించారు. ఈ సినిమా గురించి మీకు ఇంకా తెలిస్తే మాకు కూడా చెప్పండి.

ఇక అప్పట్లో
పాట ఆబాలగోపాలాన్నీ ఒక ఊపు ఊపేసిందట. జనాలు తోచినా, తోచకున్నా.. పాటనే పాడుకుంటూ ఉండేవారట.

ఘంటసాల
గారి పాట
అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం..
అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం..

పడమట సంధ్యారాగం.. కుడి ఎడమల కుసుమపరాగం..
పడమట సంధ్యారాగం.. కుడి ఎడమల కుసుమపరాగం..
ఒడిలో చెలి మోహనరాగం.. ఒడిలో చెలి మోహనరాగం..
జీవితమే మధురానురాగం.. జీవితమే మధురానురాగం..

అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం..
అందమే ఆనందం..!!

పడిలేచే కడలి తరంగం.. పడిలేచే కడలి తరంగం..
ఒడిలో జడిసిన సారంగం.. ఒడిలో జడిసిన సారంగం..
సుడిగాలిలో ఎగిరే పతంగం.. సుడిగాలిలో ఎగిరే పతంగం..
జీవితమే ఒక నాటకరంగం.. జీవితమే ఒక నాటకరంగం..

అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం..
అందమే ఆనందం..!!

P.లీల గారి పాట
అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం..
అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం..

పడమట సంధ్యారాగం.. కుడి ఎడమల కుసుమపరాగం..
పడమట సంధ్యారాగం.. కుడి ఎడమల కుసుమపరాగం..
ఒడిలో చెలి తీయని రాగం.. ఒడిలో చెలి తీయని రాగం..
జీవితమే మధురానురాగం.. జీవితమే మధురానురాగం..

అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం..
అందమే ఆనందం..!!

చల్లని సాగర తీరం.. మది జల్లను మలయ సమీరం..
చల్లని సాగర తీరం.. మది జల్లను మలయ సమీరం..
మదిలో కదిలే సరాగం.. మదిలో కదిలే సరాగం..
జీవితమే అనురాగయోగం.. జీవితమే అనురాగయోగం..

అందమే ఆనందం.. ఆనందమే జీవిత మకరందం..
అందమే ఆనందం..!!

4 comments:

  1. Good One!!! Manchi patani gurtu chesinanduku dhanyavadalu

    ReplyDelete
  2. Wow. I like this song very much.

    "పడమట సంధ్యారాగం.. కుడి ఎడమల కుసుమపరాగం.."

    ఆ పాడే సమయం లో ఘంటసాల స్వరం. ఓహ్! చెప్పలేం. Where are you getting these lyrics?

    Sorry trade secret kadoo! :-)

    Good posts.

    ReplyDelete
  3. గీతాచార్య గారూ..
    ఇందులో ట్రేడ్ సీక్రెట్ ఏమీ లేదండి. పాటల్ని వింటూ కష్టపడి నేనే స్వయంగా టైపు చేస్తాను :)

    ReplyDelete
  4. ee pataku Ghantasala Gaaru 1 hour/ganta vyavadhi lo swaraparicharu

    Harish

    Bank Of sri Ghantasala

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!