Tuesday, November 25, 2008

బంగారం ముచ్చట్లు

బంగారం ముచ్చట్లు.. అనే టైటిల్ చూసి ఏమనుకుంటున్నారూ ..? అమ్మాయిలందరికీ బంగారు గాజులు, హారాలు, వడ్డాణాలూ , నగల డిజైన్లు వగైరా వగైరా..వన్నీ కళ్ళ ముందు స్లైడ్ షో లా కనిపించేసాయా.. :) అబ్బాయిలేమో.. ఏంటో.. ఈ అమ్మాయిలు.. చీరలు, నగలు టాపిక్ మాత్రం ఎన్ని యుగాలు మాట్లాడుకున్నా తనివి తీరదు.. ప్చ్.. ఏం చేస్తాం.. అని నిట్టూరుస్తున్నారా..? అలాగయితే అక్కడే ఆగిపోండలా ...!! ఎందుకంటే ఈ బంగారం ఆ బంగారం కాదుగా.. హ్హ హ్హ..హ్హా.. :)

సరే ఇంక ఎక్కువ సుత్తి కొట్టకుండా నేరుగా విషయానికి వచ్చేస్తాను. మన తోటి బ్లాగ్గర్లందరూ రాస్తున్న మంచి మంచి రాతలు చూసి నేను కూడా బాగా ఉత్సాహం తెచ్చేసుకునీ కొత్తగా ఈ ఘన కార్యానికి పూనుకున్నానన్నమాట.. అదీ అసలు సంగతి :)

ఇక 'బంగారం' విషయానికొస్తే.. మన కథలో కథానాయిక పేరు 'బంగారం' అన్నమాట..! అంటే అసలు పేరు సీతామహాలక్ష్మి అనుకోండి. కానీ, వాళ్ళాయన ప్రేమగా పిలిచే పేరు బంగారం అన్నమాట. పేరుకు తగ్గట్టుగానే అసలు సిసలైన తెలుగింటి బంగారు తల్లే..! చాలామంది తెలుగు అమ్మాయిల్లాగే తను కూడా పుట్టింట్లో చాలా గారాబంగా పెరిగింది. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్నప్పుడు ఏరి కోరి ప్రేమించి పెళ్ళాడింది రఘురాముడిని (పేరు రఘురామ్ అనుకోండి.. వినడానికి బాగుంటుందని..నేనే కొంచెం బిల్డప్ ఇచ్చాను :) మధ్యలో ఈ రఘురాం ఎవరు చెప్మా అనుకునేరు.. ఆయనే ఇందాక నేను చెప్పిన వాళ్ళాయనన్నమాట..! కొంచెం కన్ఫ్యూస్ చేసినా మొత్తానికి బాగానే పరిచయం చేసాననుకుంటున్నాను. ఏమంటారూ..?

మన రాముడేమో.. కాస్త తక్కువ మాట్లాడే రకం. కాస్త కాదుగానీ, బాగా తక్కువ మాట్లాడే రకం. మరి అతనికి దొరికిన బంగారమేమో.. మాటలుంటే చాలు.. అన్నం తినాలని కూడా మర్చిపోయే రకం :) కానీ మనసు మాత్రం వెన్నముద్ద. కూసింత పెంకితనం, కాసింత గడుసుతనం, మరి కాస్త అమాయకత్వం, బోలెడంత మంచితనం.. ఇవన్నీ కలిస్తే మన బంగారం..! మీ ఆయన ఎటూ ఎక్కువ మాట్లాడడు కాబట్టి నువ్వైనా మీ కబుర్లు మాకు కాస్త వినిపించు అమ్మడూ... అని అడిగితే సంతోషంగా సరేనంది. అందుచేత.. తీరిక వేళల్లో బంగారం మనకు వాళ్ల ముచ్చట్లు కొన్ని వినిపిస్తూ ఉంటుందన్నమాట..! మరి వాళ్ల కీచులాటలూ, వాదులాటలూ, తిట్టుకోవడాలూ, బతిమాలుకోవడాలూ, ప్రేమలూ, గీమలూ, అల్లరీ, గిల్లరీ .. ఇలాంటివన్నీ మీరు కూడా విని ఆనందించాలంటే.. తను చెప్పేదాకా వేచి చూడాలి..! చూస్తుంటారా మరి..??

7 comments:

  1. మీరు చెప్పటమే ఆలస్యం.. మేమంతా సిద్దంగా ఉన్నాము...

    ReplyDelete
  2. "ప్రేమలూ, గీమలూ, అల్లరీ, గిల్లరీ .. ఇలాంటివన్నీ మీరు కూడా విని ఆనందించాలంటే.. "
    మీదే ఆలస్యం. వినటానికి మేము సిద్ధం.

    ReplyDelete
  3. tappaka vechi chustamu madhura vani garu...
    bapu bomma lanti achamaina teluginti aada paduchu bangaram gurinchi cheptanu ante evariki istam undadu chepandi

    ReplyDelete
  4. వినిపించండి "బంగారం"లాంటి "మధుర వాణీయం"..

    ReplyDelete
  5. 'బంగారం ముచ్చట్లు' వినే ఆసక్తి చూపించినందుకు మీ అందరికీ కృతజ్ఞతలు. త్వరలోనే తప్పకుండా మీ ముందుకి తెస్తాను.

    @ శ్రీనివాస్ గారు,
    టెంప్లేట్ మార్చమని మీరు సలహా ఇచ్చాక.. బ్లాగింగ్ గురించి కొంచెం బాగా పరిశోధించి ఎలాగో టెంప్లేట్ మార్చగలిగాను. మధుర వాణి ఎలా ఉందంటారు ఇప్పుడు??

    ReplyDelete
  6. Telugu Lipi Chadavataniki Ye Fonts Install Cheyalo Cheppandi Please Becoz I could not read this

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!