Sunday, November 09, 2008

నేననీ నీవనీ.. వేరుగా లేమనీ.. చెప్పినా వినరా ఒకరైనా...!! నేను నీ నీడనీ.. నువ్వు నా నిజమనీ.. ఒప్పుకోగాలరా ఎపుడైనా..!!!

హలో హలో...!!
ఆదివారం బాగా ఎంజాయ్ చేస్తున్నారా?? ఈ వేళ మరో కొత్త స్వరం వినిపిస్తున్నాను. మధ్య కాలంలో వచ్చిన ఒక మంచి సినిమాలోని మంచి పాట. "నీవనీ నేననీ.. వేరుగా లేమనీ.. చెప్పినా వినరా ఒకరైనా.." అనే ఈ పాట ఈ మధ్యే వచ్చిన 'కొత్త బంగారు లోకం' అనే సినిమాలోనిది. సినిమా అయితే నేను ఇంకా చూళ్ళేదు గానీ, చూసిన వాళ్లందరూ బావుంది అంటున్నారు మరి. పాటలు మాత్రం నాకు చాలా నచ్చాయి. మిక్కీ జె మేయర్ సంగీతం కొత్తదనాన్ని, ఉత్సాహాన్ని తీసుకొచ్చే విధంగా ఉంది. సాహిత్య పరంగా మంచి విలువలు ఉన్నాయి. మంచి అభిరుచి గల నిర్మాతగా పేరు తెచ్చుకున్న 'దిల్' రాజు గారు మరో మంచి కుటుంబ కథా చిత్రంగా కొత్త బంగారు లోకాన్ని మనకి అందించారు. శ్రీకాంత్ అడ్డాల అనే యువ దర్శకుడు ఈ సినిమా ద్వారా పరిచయం అయ్యారు. సినిమాలో పాటలన్నీ వినసొంపుగా మరియు సందర్భోచితంగా ఉన్నాయి. అన్నీ పాటల్లోకి నాకయితే ఈ పాట బాగా నచ్చింది. పాట సంగీతం, సాహిత్యం, గాత్రం అన్నీ చాలా మెల్లగా, మధురంగా సాగుతాయి. హ్యాపీ డేస్ లో చందుగా మనకి దగ్గరైన వరుణ్ సందేశ్ ఈ సినిమాలో హీరో. నగేష్ కుకునూర్ ఆణిముత్యం 'ఇక్బాల్' సినిమాలో హీరో చెల్లెలిగా అద్భుతంగా నటించిన శ్వేత ప్రసాద్ ఈ సినిమాలో హీరోయిన్. ఇద్దరూ వయసుకి తగ్గ పాత్రలో చక్కగా సరిపోయారు కాలేజీ ప్రేమకథకి... ఎప్పటిలాగే సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు మనసుని హత్తుకునే సాహిత్యం అందించారు. ఈ పాట పట్ల ఆకర్షితులవ్వడానికి ఇదే ముఖ్య కారణం. పాడిన అమ్మాయి కూడా చాలా చక్కగా పాడింది. శ్వేత ప్రసాద్ అని రాసారు గాయని పేరు. మరి ఈ అమ్మాయి హీరోయినో లేక వేరే అమ్మాయో నాకు సరిగ్గా తెలీదు. ఎవరైనా గానీ, పాట మాత్రం చాలా చక్కగా పాడింది. ఆ అమ్మాయి గొంతులో సున్నితత్వమే ఈ పాటలో మాధుర్యాన్ని నింపింది. పాటలో వినిపించే కోరస్ పాటకి ఒక వింత అందాన్ని తీసుకొచ్చింది. పదహారు ప్రాయంలోని అమ్మాయి మనసులోని తొలిప్రేమ భావాలని సిరివెన్నెల గారు అద్బుతంగా ఆవిష్కరించారు ఈ పాటలో. ఇవన్నీ కలిసి ఈ పాటని మనం మళ్లీ మళ్లీ వినేలా చేస్తున్నాయి. మనం ఒకసారి సాహిత్యం చూద్దామా మరి..!

నేననీ నీవనీ.. వేరుగా లేమనీ..

చెప్పినా.. వినరా.. ఒకరైనా..!

నేను నీ నీడనీ.. నువ్వు నా నిజమనీ..

ఒప్పుకోగాలరా ఎపుడైనా..!

రెప్ప వెనకాలా స్వప్నం.. ఎప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే..

అడ్డుకోగాలరా వేగం.. కొత్త బంగారూ లోకం పిలిస్తే...!!!


మొదటి సారి మదిని చేరి..
నిదుర లేపిన ఉదయమా..!!
వయసులోని పసితనాన్ని..
పలకరించిన ప్రణయమా..!!
మరీ కొత్తగా.. మరో పుట్టుక..
అనేటట్టుగా.. ఇది నీ మాయేనా..!!!

నేననీ నీవనీ.. వేరుగా లేమనీ..

చెప్పినా.. వినరా.. ఒకరైనా..!

నేను నీ నీడనీ.. నువ్వు నా నిజమనీ..

ఒప్పుకోగాలరా ఎపుడైనా..!

రెప్ప వెనకాలా స్వప్నం.. ఎప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే..

అడ్డుకోగాలరా వేగం.. కొత్త బంగారూ లోకం పిలిస్తే...!!!

పదము నాది.. పరుగు నీది..
రధమువై రా ప్రియతమా..!!
తగువు నాది.. తెగువ నీది..
గెలుచుకో పురుషోత్తమా..!!
నువ్వే దారిగా.. నిన్నే చేరగా..
ఎటూ చూడకా.. వెనువెంటే రానా..!!!

నేననీ నీవనీ.. వేరుగా లేమనీ..

చెప్పినా.. వినరా.. ఒకరైనా..!

నేను నీ నీడనీ.. నువ్వు నా నిజమనీ..

ఒప్పుకోగాలరా ఎపుడైనా..!

రెప్ప వెనకాలా స్వప్నం.. ఎప్పుడెదురయ్యే సత్యం తెలిస్తే..

అడ్డుకోగాలరా వేగం.. కొత్త బంగారూ లోకం పిలిస్తే...!!!

7 comments:

  1. శ్వేతా ప్రసాద్ అని తప్పుగా వేసారట పేరు.ఎవరో శ్వేతా మీననో,శ్వతా చంద్రన్నో పాడారట.[క్షమించాలి పేరు గుర్తులేదు] పాడింది మాత్రం హీరోయిన్ కాదు.
    బైదవే నాకూ ఈ పాట ఇష్టమే. అలాగే ఇందులోనే "అలలుండని కడలేదని"అంటూ సాగే పాట చాలా చాలా బాగుంటుంది.

    ReplyDelete
  2. సిరివెన్నెల సీతారామ శాస్త్రి రాసిన, ఈ అందమైన పాట పాడినది శ్వేతా పండిట్. CD కవరుపై పొరబాటుగా స్వేతా ప్రసాద్ అని అచ్చయ్యింది. చిత్రంలో ఈ పాట చిత్రీకరణ బాగుంది. నాయిక స్వేతా ప్రసాద్ చక్కటి నటి అని మీరు ఒప్పుకొంటారు.ఈ పాట వీడియోను ఇక్కడ చూడవచ్చు.

    http://www.youtube.com/watch?v=ob_XdRmLgjM

    ReplyDelete
  3. రాధిక గారు , c b రావు గారు,
    గాయనిని మాకు తెలియజేసినందుకు సంతోషం. వీడియోను చూసే అవకాశం కూడా కల్పించారు.
    ధన్యవాదాలు..!

    ReplyDelete
  4. Hello Madhura vaani garu... mee yokka rachana baaagundhi... shwetha pandit singer ki ee pataku FilmFare award kuda vachindhi.. tanu telugu ammay kakapoyina entho andham gaa padindhi.. pata gurinchi cheppinandhuku thanks...

    ReplyDelete
  5. @ అనుదీప్,
    మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు. :)

    ReplyDelete
  6. Hello Madhu gaaru...

    Female vocal songs telugu lo one of my fav song idhi... ee pata paadina ammay kuda, paata antha andham ga untundhi... naaku matramey kaadhu.. naa colleagues lo oka ammay ki kuda ee paata ishtam.. tanaki telugu raadhu she is from mumbnai... but she loves that song very much... okasaari ee paata gurthu chesinandhuku thanks...

    - Shyam

    ReplyDelete
  7. @ Shyam,
    మీ స్పందనకి ధన్యవాదాలు.

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!