ఈ రోజు మనందరికీ ఎంతో ఎంతో ప్రియమైన, ఆనాటి ఆణిముత్యమైన ఈ పాటను గుర్తు చేస్తున్నాను.
పైన పేరు చూసి మీ అందరికీ ఈ పాట ఏంటో తెలిసిపోయే ఉంటుంది కదా..!

సరే...ఈ పాట 1982 లో వచ్చిన నాలుగు స్తంభాలాట అనే చిత్రంలోనిది. నలుగురు వ్యక్తుల జీవితంతో విధి ఎలా నాలుగు స్తంభాలాట ఆడిందనేదే ఈ చిత్ర కథ. ఆ నలుగురు వ్యక్తులుగా నరేష్, పూర్ణిమ, ప్రదీప్, తులసి నటించారు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్క్రీన్ ప్లే, దర్శకత్వం హాస్య బ్రహ్మ జంధ్యాల గారు. ముద్ద మందారం, మల్లె పందిరి తరవాత ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమా ఇది.సందర్భం వచ్చింది కాబట్టి ఆ మహానుభావుడి గురించి కొంత మాట్లాడాలనిపిస్తుంది.
జంధ్యాల గారి పూర్తి పేరు 'జంధ్యాల వీరవెంకట దుర్గాశివ సుబ్రమణ్య శాస్త్రి'.

"నవ్వడం ఒక భోగం...నవ్వించడం ఒక యోగం...నవ్వలేకపోవడం ఒక రోగం.." అని జంధ్యాల గారి డైలాగ్. ఆ మాటనే పాటిస్తూ ఆయన చివరిదాకా మనల్ని నవ్వుల్లో ముంచెత్తారు. మంచివాళ్లనెప్పుడూ దేవుడు ముందుగా తీసుకెళ్ళిపోతాడన్నట్టు... ఆయన యాభై ఏళ్ళకే మనల్ని విడిచి వెళ్ళారు. ఆయన లేని లోటు ఇంకెవరూ తీర్చలేరనేది అందరూ ఒప్పుకునే సత్యం. మళ్లీ మరో జంధ్యాల పుడితే ఎంత బావుండునో కదా... :(
సుత్తి అనే మాట తెలియని, ఉపయోగించని తెలుగు వాళ్లు ఉండరంటే అతిశయోక్తి కాదు. ఆ మాట వచ్చిందే జంధ్యాల గారి ఈ నాలుగు స్తంభాలాట సినిమాలోంచి. ఈ సినిమాలోనే మన ప్రముఖ సుత్తి జంట అయిన సుత్తి వీరభద్ర రావు గారు, సుత్తివేలు గారు పరిచయమయ్యారు. మీకు గుర్తుందో లేదో కానీ... ఈ సినిమాలో సుత్తివేలు గారు సుత్తి అంటే ఏంటి? ఎన్ని రకాలు? అనే దాని మీద ఒక చిన్నపాటి ఉపన్యాసం కూడా ఇస్తారు. ఆ సుత్తే అప్పటి నుంచి ఇప్పటి దాకా మన జీవితాల్లో పెనవేసుకుపోయింది. ఎప్పటికీ ఉంటుంది కూడా...ఎందుకంటే సుత్తి వేసే వాళ్లు ఎప్పుడూ ఉంటారుగా మరి :)

ఇంక మళ్ళీ పాట విషయానికి వస్తే... సంగీతం రాజన్-నాగేంద్ర ద్వయం అందించగా సాహిత్యాన్ని వేటూరి గారు రాసారు. మీకు తెలుసో లేదో.. ఈ పాట హిందీ లో కూడా వచ్చింది. 1992 లో వచ్చిన Deewaana సినిమాలో షారుఖ్ ఖాన్, దివ్య భారతి ల మీద ఈ పాటను చిత్రీకరించారు. ऐसी दीवानगी देखी कही नही... అని సాగుతుంది ఈ పాట హిందీలో.
ఈ సినిమాలో నరేష్, పూర్ణిమ కాలేజీలో చదువుకుంటూ ప్రేమలో పడతారు. అప్పుడు వచ్చే ప్రేమగీతం ఈ పాట.


అచ్చ తెలుగు కుందనపు బొమ్మలా ఉండే పూర్ణిమ జంధ్యాల గారి చాలా సినిమాల్లో నటించింది. ఈ పాటలో ఒకసారి వచ్చిన వాక్యం మళ్లీ రాదు. అంటే అదే బాణిలో వేరే వేరే పదాలతో రాసారన్నమాట. ఆ గొప్పతనం వేటూరి గారికే చెల్లింది.
సరే మరి...ఒక సారి ఈ పాట సాహిత్యం చూద్దామా...
చినుకులా రాలి..నదులుగా సాగి..
వరదలై పోయి..కడలిగా పొంగు..

నీ ప్రేమ..నా ప్రేమ.. నీ పేరే ప్రేమ...
నదివి నీవు..కడలి నేను..
మరచిపోబోకుమా..మమత నీవే సుమా...!
చినుకులా రాలి..నదులుగా సాగి..
వరదలై పోయి..కడలిగా పొంగు..
నీ ప్రేమ..నా ప్రేమ.. నీ పేరే ప్రేమ...!
ఆకులు రాలే వేసవి గాలి.. నా ప్రేమ నిట్టూర్పులే...
కుంకుమ పూసే వేకువ నీవై.. తేవాలి ఓదార్పులే...
ప్రేమలు కోరే జన్మలోనే నే వేచి ఉంటానులే...
జన్మలు తాకే ప్రేమను నేనై నే వెల్లువౌతానులే.. వెల్లువౌతానులే...!
హిమములా రాలి.. సుమముల పూసి...
ఋతువులై నవ్వి.. మధువులై పొంగి...
నీ ప్రేమ..నా ప్రేమ.. నీ పేరే ప్రేమ...
శిశిరమైనా.. శిథిలమైనా.. విడిచిపోబోకుమా.. విరహమైపోకుమా...!

తొలకరి కోసం తొడిమను నేనై.. అల్లాడుతున్నానులే...
పులకరమూదే పువ్వుల కోసం.. వేసారుతున్నానులే...
నింగికి నెల అంటిసలాడే.. ఆ పొద్దు రావాలిలే...
పున్నమి నేడై.. రేపటి నీడై.. ఆ ముద్దు తీరాలిలే.. తీరాలు చేరాలిలే... !
మౌనమై వెలసి.. గానమై పిలిచి...
కలలతో అలసి.. గగనమై ఎగసి...
ఈ ప్రేమ.. నా ప్రేమ.. తారాడే మన ప్రేమ...
భువనమైనా.. గగనమైనా.. ప్రేమమయమే సుమా.. ప్రేమ మనమే సుమా...!
చినుకులా రాలి..నదులుగా సాగి..
వరదలై పోయి..కడలిగా పొంగు..
నీ ప్రేమ..నా ప్రేమ.. నీ పేరే ప్రేమ...
నదివి నీవు..కడలి నేను..
మరచిపోబోకుమా..మమత నీవే సుమా...!
మరి ఇంకెందుకు ఆలస్యం...ఈ పాటలోని మాధుర్యాన్ని మీరు కూడా ఆస్వాదించండి.
ఇంక సెలవు..!
very cool.
ReplyDeletewhen will you go online?
ReplyDeletevery cool.
ReplyDeleteim here because of few cents for you. just dropping by.
ReplyDeletechaala manchi parishodana
ReplyDelete