Friday, October 17, 2008

పగలే వెన్నెల...జగమే ఊయల...

నాకు చాలా చాలా ఇష్టమైన పాత పాటల్లో ఇదొకటి. అసలు రోజంతా ఈ ఒక్క పాటనే వింటూ ఉండిపోయిన రోజులు కూడా ఉన్నాయి.ఎన్ని సార్లు విన్నా విసుగు రాదు ఈ పాట. అంత అద్భుతమైన సంగీతం, సాహిత్యం, గాత్రం...వెరసి ఈ పాట.
ఈ మధురమైన పాట 1964 లో B.N రెడ్డి గారి దర్శకత్వంలో వచ్చిన పూజాఫలం అనే చిత్రం లోనిది.
ఈ సినిమాలో ANR, మహానటి సావిత్రి, జమున, జగ్గయ్య తదితరులు నటించారు. ఈ చిత్రంలో ANR ఒక పెద్ద జమీందార్ మనవడు. అతనికి ఎవ్వరితోనూ ఎక్కువ పరిచయం ఉండదు. అందులోనూ అమ్మాయిలంటే ఏంటో కూడా అతనికి తెలీదు. ANR కి ఉన్నా ఒక్క తాతయ్య కూడా చనిపోయాక ఇంకా ఒంటరి అయిపోతాడు పాపం. అప్పుడు ANR వాళ్ల ఇంట్లోకి జమున వాళ్లు అద్దెకు ఉంటారు. జమున బాగా మాటకారి, స్నేహశీలి, మహా చిలిపి అయిన అమ్మాయి. చాలా చొరవగా ANR రూంలోకి కూడా వచ్చేస్తూ ఉంటుంది. అయితే ఒకరోజు ANR ఇంటికొచ్చేసరికి ఈ మధురమైన పాట "పగలే వెన్నెల...జగమే ఊయల" అని తన గదిలోనుంచి వినిపిస్తుంది. వెళ్లి చూసేసరికి పియానో మీద అందంగా వాయిస్తూ పాట పాడుతున్న జమున కనిపిస్తుంది. ఈ పాట చిత్రీకరణ కూడా భలే బావుంటుంది. మీరు ఒకసారి చూసారంటే మీరెప్పుడు ఈ పాట విన్నా, అదే గుర్తొస్తుంది తప్పకుండా..ఇంకో సంగతి ఏంటంటే...సినిమా చివరలో ANR గతం మర్చిపోతే, జమున వచ్చి ఈ పాట కొంచెం పాడగానే ANR కి అన్నీ గుర్తోచ్చేస్తాయి. హ్హ హ్హ హా.. మరీ cinematic గా ఉంది కదా...! పాత సినిమాల్లో కొన్ని సన్నివేశాలు అలాగే అనిపిస్తాయి ఇప్పుడు మనకి. ఏది ఏమైనప్పటికీ నిజంగా అలాంటి పాట వింటే గతం గుర్తొచ్చినా రావచ్చేమో...! ఏమంటారూ?
ఈ పాటకి సంగీతం వర్ధమాన సంగీత దర్శకుడు కోటి తండ్రిగారైన సాలూరి రాజేశ్వరరావు గారు. పాడింది S.జానకి గారు.
రాసింది మన తెలుగుజాతి గర్వించదగ్గ మహాకవి, జ్ఞాన పీఠ్ అవార్డు గ్రహీత అయిన Dr.C నారాయణ రెడ్డి గారు. ఈ పాటలో సాహిత్యాన్ని గురించి చెప్పుకోకుండా ఈ పాట గురించి మాట్లడుకోలేము...ఒక్కసారి మీరే చూడండి... ఈ మృదుమధురమైన భావాలని...వింటుంటే హాయిగా మబ్బుల్లో తేలుతున్నట్టుంటుంది. అసలు మన మూడ్ బాగాలేనప్పుడు ఇలాంటి పాటలు వింటే చాలు. మనసుకు స్వాంతన కలుగుతుంది.
పగలే వెన్నెలా... జగమే ఊయలా...
కదిలే
వూహలకే కన్నులుంటే...

పగలే
వెన్నెలా... జగమే ఊయలా...

నింగిలోన
చందమామ తొంగి చూచే..
నీటిలోన
కలువభామ పొంగి పూచే..
అనురాగమే జీవన రాగమై...
అనురాగమే జీవన రాగమై...
ఎదలో
తేనెజల్లు కురిసిపోదా....

పగలే
వెన్నెలా...జగమే ఊయలా...

కడలి
పిలువ కన్నెవాగు పరుగుతీసే..
మురళిపాట
విన్న నాగు శిరసునూపే..
అనుబంధమే మధురానందమై...
అనుబంధమే మధురానందమై...
ఇలపై
నందనాలు నిలిపిపోదా...

పగలే వెన్నెలా....జగమే ఊయలా...

నీలి
మబ్బు నీడలేచి నెమలి ఆడే...
పూల ఋతువు సైగ చూసి పిఖము పాడే...
నీలి మబ్బు నీడలేచి నెమలి ఆడే...
పూల
ఋతువు సైగ చూసి పిఖము పాడే...
మనసే
వీణగా ఝన ఝన మ్రోయగా...
బ్రతుకే
పున్నమిగా విరిసిపోదా...

పగలే వెన్నెలా....

ఇక సెలవు మరి...!

2 comments:

  1. బాగుందండి,మంచిపాట,చక్కని వివరణ,కింద youtube లాంటి లంకె కూడా ఇచ్చుంటే ఇంకా బాగుండేది.వర్డ్ వెరిఫికేషన్ తీసెయ్యగలరు

    ReplyDelete
  2. ippat chivaraloo anr ... yenthaa haayigaa paadaavu vaasanthii antaaru ....
    alaagyee nenuu ...
    yentha andhangaa raasava vani.....
    .............ok

    ReplyDelete

Thanks for visiting my blog. Your response on my blog posts is greatly appreciated!